Chiranjeevi : ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ లో మెగాస్టార్ సందడి.. తిలక్ వర్మ, అభిషేక్ శర్మలతో కలిసి..
మెగాస్టార్ చిరంజీవి, సుకుమార్ ఫ్యామిలీ, నారా లోకేష్ మరికొంతమంది తెలుగు సెలబ్రిటీలు దుబాయ్ వెళ్లి మ్యాచ్ ని ఆస్వాదించారు.
- By News Desk Published Date - 08:03 AM, Mon - 24 February 25

Chiranjeevi : నిన్న రాత్రి ఇండియా – పాకిస్థాన్ మ్యాచ్ ఉత్కంఠభరంగా సాగిన సంగతి తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ లో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరగ్గా భారత్ భారీ విజయం సాధించింది. కోహ్లీ సెంచరీతో అదరగొట్టాడు. ఇండియన్ బౌలర్లు రెచ్చిపోయి వికెట్స్ తీశారు. బ్యాట్స్ మెన్ కూడా మంచి హిట్టింగ్ చేసారు. ఈ మ్యాచ్ చూడటానికి చాలామంది సినీ సెలబ్రిటీలు కూడా వెళ్లారు.
మ్యాచ్ కోసం మెగాస్టార్ చిరంజీవి, సుకుమార్ ఫ్యామిలీ, నారా లోకేష్ మరికొంతమంది తెలుగు సెలబ్రిటీలు దుబాయ్ వెళ్లి మ్యాచ్ ని ఆస్వాదించారు. ఈ క్రమంలో చిరంజీవితో మన తెలుగు వాడు క్రికెటర్ తిలక్ వర్మతో పాటు క్రికెటర్ అభిషేక్ శర్మ కల్సి ఫోటోలు దిగారు. తిలక్ వర్మ చిరంజీవితో కలిసి దిగిన ఫోటో షేర్ చేసి మెగాస్టార్ తో కలిసి మ్యాచ్ చూసే అవకాశం వచ్చింది అంటూ సంతోషంగా సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసాడు. నారా లోకేష్ తోను పలువురు ఫోటోలు తీసుకున్నారు.
ఇక చిరంజీవి కూడా తిలక్ వర్మ, అభిషేక్ వర్మలతో పాటు పలువురు బిజినెస్ మెన్, టీమ్ ఇండియా ప్రతినిధులతో కలిసి మ్యాచ్ ని చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేసారు. మ్యాచ్ కి సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసి కోహ్లీ సెంచరీ సాధించినందుకు, ఇండియా గెలిచినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టారు.
Also Read : Record in Cricket History : భారత్ vs పాక్ మ్యాచ్‌కు 60 కోట్ల వ్యూస్