Mothers Day 2025 : ‘మదర్స్ డే’.. రామ్‌చరణ్, చిరు, నాని, సాయి పల్లవి ఎమోషనల్
‘‘మా అమ్మ సురేఖే మాకు లోకం. ఆమె మాకు గొప్ప మార్గదర్శి. అమ్మ(Mothers Day 2025) గైడెన్స్ వల్లే నేను ఇంతటి స్థాయిలో ఉన్నాను’’ అని హీరో రామ్‌చరణ్ అన్నారు.
- By Pasha Published Date - 08:40 AM, Sun - 11 May 25

Mothers Day 2025 : అమ్మ.. ఎల్లలు లేని ప్రేమకు చిరునామా. పిల్లలే జీవితంగా ప్రతి క్షణం గడిపే మహోన్నత జీవి అమ్మ. బాధ్యతకు నిలువెత్తు నిదర్శనం అమ్మ. అమ్మను మించిన మార్గదర్శి ఈ ప్రపంచంలో మరొకరు ఉండరు. సమాజానికి గొప్ప పౌరులను అందించే తిరుగులేని టీచర్ అమ్మ. మనకు కనిపించే దైవం అమ్మ. అలాంటి అమ్మ గురించి కొందరు సినీతారలు ఏమన్నారో చూద్దాం..
హీరో రామ్‌చరణ్ ఏమన్నారంటే..
‘‘మా అమ్మ సురేఖే మాకు లోకం. ఆమె మాకు గొప్ప మార్గదర్శి. అమ్మ(Mothers Day 2025) గైడెన్స్ వల్లే నేను ఇంతటి స్థాయిలో ఉన్నాను’’ అని హీరో రామ్‌చరణ్ అన్నారు. ‘‘నా చిన్నప్పుడు నాన్న(చిరంజీవి) నిత్యం సినిమా షూటింగ్‌లలో బిజీగా ఉండేవారు. అప్పుడు మా అమ్మే నాకు చదువు, కెరీర్‌పరంగా గైడెన్స్ ఇచ్చేవారు’’ అని ఆయన తెలిపారు. ‘‘నేను, నాన్న కలిసి ఒక సినిమా చేయాలనేది మా అమ్మ కోరిక. అందులో భాగంగానే మేం ఆచార్య మూవీలో కలిసి నటించాం. మా అమ్మ కల నెరవేరింది. ఆచార్య షూటింగ్ టైంలో నేను, నాన్న కలిసి ఒకే హోటల్ గదిలో మూడు వారాలకుపైగా ఉన్నాం’’ అని రామ్‌చరణ్ చెప్పుకొచ్చారు.
Also Read :Terrorist Attack: దేశంలో మరో ఉగ్రదాడి.. అసలు నిజం ఇదే!
ఈ జీవితమే అమ్మకు అంకితం : మెగాస్టార్ చిరంజీవి
‘‘మదర్స్ డే పేరుతో అమ్మ ప్రాధాన్యతను కేవలం ఒక్కరోజుకు పరిమితం చేయకూడదు. ఈ జీవితమే అమ్మ ఇచ్చింది. జీవితాంతం మనమంతా అమ్మకు రుణపడి ఉండాలి. అమ్మ గొప్పతనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎంత గొప్పవారికైనా అమ్మే మార్గదర్శి. అమ్మే స్ఫూర్తిప్రదాత. ప్రతీ ఒక్కరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు’’ అని పేర్కొంటూ ఎక్స్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి ఒక పోస్ట్ చేశారు.
మా అమ్మ నమ్మకాన్ని నిలబెట్టాను : హీరో నాని
‘‘మా అమ్మ అందించిన ప్రోత్సాహం వల్లే నేను సినీ ఇండస్ట్రీలో హీరో రేంజుకు ఎదిగాను. మమ్మల్ని తొలుత మా అమ్మ నమ్మింది. ఆ తర్వాతే అందరూ నమ్మారు. మా అమ్మ మాపై చూపిన నమ్మకమే మాకు బలాన్ని ఇచ్చింది. మా అమ్మ నమ్మకాన్ని నిలబెట్టాను. సినిమాల్లో రాణించాను. నేను సినిమాల్లో డబ్బు సంపాదించి కార్లు కొన్నాను. అయినా మా అమ్మ మాత్రం ఆఫీసుకు సింపుల్‌గా బస్సులోనే వెళ్తుంటుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని అమ్మ చెబుతుంటుంది. నేను నటించిన ఈగ సినిమా అంటే మా అమ్మకు ఇష్టం. చనిపోయే పాత్రల్లో అస్సలు నటించొద్దని మా అమ్మ చెబుతుంటుంది’’ హీరో నాని చెప్పుకొచ్చారు.
అమ్మ మాటలే ముందుకు నడుపుతున్నాయి : హీరోయిన్ సాయి పల్లవి
‘‘మా అమ్మ పేరు రాధా కన్నన్. ఏది చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని మా అమ్మ చెబుతుంటుంది. మా అమ్మ మాటలే నేను నిత్యం పాటిస్తాను అందుకే కెరీర్‌లో సక్సెస్ లభిస్తోంది. నాకు ఎప్పుడైనా బాధగా, ఒత్తిడిగా అనిపిస్తే వెంటనే అమ్మకు కాల్ చేస్తాను. ఆ సమయంలో అమ్మ ఇచ్చే సలహాలు నాలో ధైర్యాన్ని నింపుతాయి’’ అని హీరోయిన్ సాయి పల్లవి తెలిపారు.