Ceasefire Violation: కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాకిస్తాన్.. జమ్మూకశ్మీర్ సీఎం ఫైర్!
పాకిస్థాన్ రాజౌరీ, బారాముల్లా ప్రాంతాల్లో భారత భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని నిరంతర కాల్పులు జరిపింది. అంతేకాకుండా ఆర్‌ఎస్‌పురా ప్రాంతంలో కూడా పాకిస్థాన్ యుద్ధ విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.
- By Gopichand Published Date - 09:11 PM, Sat - 10 May 25

Ceasefire Violation: పాకిస్థాన్ మరోసారి యుద్ధ విరమణ ఒప్పందాన్ని (Ceasefire Violation) ఉల్లంఘించి జమ్మూ కాశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల్లో భారత సరిహద్దులపై కాల్పులు ప్రారంభించింది. ఈ సంఘటన రాజౌరీ, బారాముల్లా జిల్లాల్లో వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ పాకిస్థాన్ సైన్యం అంతర్జాతీయ సరిహద్దు, లైన్ ఆఫ్ కంట్రోల్ (LOC) వద్ద భారీ కాల్పులు జరిపింది. పాకిస్థాన్ చేపట్టిన ఈ కాల్పుల వల్ల పౌర ప్రాంతాల్లో కూడా భయాందోళన వాతావరణం నెలకొంది.
నివేదికల సమాచారం ప్రకారం.. పాకిస్థాన్ రాజౌరీ, బారాముల్లా ప్రాంతాల్లో భారత భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని నిరంతర కాల్పులు జరిపింది. అంతేకాకుండా ఆర్‌ఎస్‌పురా ప్రాంతంలో కూడా పాకిస్థాన్ యుద్ధ విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అయితే భారత సైన్యం ఈ దాడికి గట్టి ప్రతిస్పందన ఇచ్చి, పాకిస్థాన్ కాల్పులను విఫలం చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న పౌరులను సురక్షితంగా ఉంచడానికి భారత భద్రతా బలగాలు కఠినమైన నిఘాను పెంచాయి.
#WATCH | J&K | Red streaks seen and explosions can be heard as India's air defence intercepts Pakistani drones amid blackout in Udhampur
(Visuals deferred by an unspecified time) pic.twitter.com/oQO8RwhBfm
— ANI (@ANI) May 10, 2025
Also Read: IPL 2025: ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్.. రేపు రీషెడ్యూల్ విడుదల?
స్థానిక ప్రజలను ఏవైనా అనిష్ట సంఘటనల నుండి తప్పించుకోవడానికి సురక్షిత ప్రదేశాలకు వెళ్లమని సూచించాయి. ఈ యుద్ధ విరమణ ఉల్లంఘన తర్వాత భారతదేశం ఈ దాడిని పాకిస్థాన్ నుండి తీవ్రంగా వ్యతిరేకించింది. రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం నుండి జోక్యం చేసుకోవాలని కోరింది. పాకిస్థాన్ ఈ చర్య వల్ల జమ్మూ కాశ్మీర్‌లో ఉద్రిక్తత మరింత పెరిగింది. అదే సమయంలో భారతదేశం తన సైన్యాన్ని మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. యుద్ధ విరమణకు ఏమైంది? శ్రీనగర్ అంతటా పేలుళ్ల శబ్దాలు వినిపించాయని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఎక్స్ వేదికగా మండిపడ్డారు. పాక్ ఇలా సీజ్‌ఫైర్ తర్వాత కాల్పులు జరపడంతో మోదీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
What the hell just happened to the ceasefire? Explosions heard across Srinagar!!!
— Omar Abdullah (@OmarAbdullah) May 10, 2025
భారత ప్రభుత్వ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మూ-కాశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్థాన్ యుద్ధ విరమణ ఉల్లంఘనకు గట్టిగా సమాధానం ఇవ్వడానికి సరిహద్దు భద్రతా దళానికి (BSF) అనుమతి ఇచ్చింది. జమ్మూ-కాశ్మీర్ పోలీసులు శ్రీనగర్‌లోని కాశ్మీర్‌లో బహుళ పేలుళ్లు జరిగినట్లు ధృవీకరించారు. లాల్‌చౌక్, బీబీ కంట్ ఏరియా, సఫాపోరాలో పేలుళ్లు సంభవించాయి. జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఆర్‌ఎస్‌పురా సెక్టార్‌లో పాకిస్థాన్ క్రాస్ బోర్డర్ కాల్పులకు బీఎస్‌ఎఫ్ సమాధానం ఇస్తోంది. ఎల్‌ఓసీలోని అఖ్నూర్ సెక్టార్‌లో కూడా కాల్పుల సంఘటనలు జరిగాయి. సైన్యం ఈ విషయంపై స్థానిక ఫార్మేషన్ నుండి సమాచారాన్ని సేకరిస్తోంది. మరోవైపు శ్రీనగర్‌లో బ్లాక్ అవుట్ విధించారు.
What the hell just happened to the ceasefire? Explosions heard across Srinagar!!!
— Omar Abdullah (@OmarAbdullah) May 10, 2025