Megastar Chiranjeevi : మెగాస్టార్ డిజిటల్ ఎంట్రీ.. వెబ్ సీరీస్ తో షాక్ ఇవ్వనున్న చిరు..!
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్నారా.. త్వరలోనే చిరు ఒక వెబ్ సీరీస్ చేస్తారా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. మెగా 150 సినిమా ఖైదీతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు వరుస
- Author : Ramesh
Date : 14-02-2024 - 8:06 IST
Published By : Hashtagu Telugu Desk
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్నారా.. త్వరలోనే చిరు ఒక వెబ్ సీరీస్ చేస్తారా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. మెగా 150 సినిమా ఖైదీతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు వరుస సినిమాలతో అదరగొట్టేస్తున్నారు. ఇక ఈమధ్య సీనియర్ స్టార్స్ కూడా డిజిటల్ రంగంలో ఎంట్రీ ఇస్తున్నారు. వెంకటేష్ ఇప్పటికే రానా నాయుడుతో డిజిటల్ ఎంట్రీ ఇచ్చేశాడు. చిరు కూడా వెబ్ సీరీస్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని తెలుస్తుంది.
ఇంతకీ చిరు వెబ్ సీరీస్ ఎవరి డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఇంతకీ ఏ ఓటీటీలో చిరు వెబ్ సీరీస్ రాబోతుంది. ఓ పక్క సినిమాలతో బిజీగా ఉన్న చిరంజీవి వెబ్ సీరీస్ ని ఎలా చేస్తాడు ఈ డౌట్లు అన్నీ వస్తున్నాయి. అయితే వెబ్ సీరీస్ కి ఇప్పటికే కథల వేట మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ లో హీరోలంతా కూడా సినిమాలకు ఈక్వల్ గా వెబ్ సీరీస్ లతో మెప్పిస్తున్నారు.
సౌత్ హీరోలు కూడా వెబ్ సీరీస్ లతో అలరించాలని చూస్తున్నారు. ఇప్పటికే నాగార్జున కూడా డిజిటల్ ఎంట్రీ ఇవ్వాలని చూస్తుండగా చిరంజీవి కూడా వెబ్ సీరీస్ తో మెగా ఫ్యాన్స్ ని మరింత అలరించాలని చూస్తున్నారు. మెగా డిజిటల్ ఎంట్రీ ఎలా ఉంటుంది. ఏయే కాంబినేషన్స్ తో ఈ సీరీస్ ప్లాన్ చేస్తున్నారన్నది త్వరలో తెలుస్తుంది.
చిరు చేస్తున్న సినిమాల విషయానికి వస్తే వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర సినిమా చేస్తున్న మెగాస్టార్ ఆ సినిమాను 2025 సంక్రాంతికి రిలీజ్ లాక్ చేస్తున్నారు. ఈ సినిమా విషయంలో ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.
Also Read : Rashmika Mandanna : ఆ సినిమా కథ నచ్చకపోయినా చేసిందా.. రష్మిక ఈ కామెంట్స్ అందరు షాక్..!