Mega Family : మెగా కుటుంబమా మజాకా.. కుటుంబంలో అందరికీ అవార్డులే
- Author : Vamsi Chowdary Korata
Date : 27-01-2024 - 11:42 IST
Published By : Hashtagu Telugu Desk
Mega Family : ఇష్టపడే పని చేస్తే ఆ పని మనల్ని ఎంతో ఎత్తుకి తీసుకువెళ్లి నిలబెడుతుంది. మెగా కుటుంబంలోని (Mega Family) వ్యక్తులనే చూస్తే అదే నిజమనిపిస్తుంది. వాళ్లు చేసే పనిని ఎంజాయ్ చేస్తూ అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటారు. చేసే పనిలో కొత్తదనం వెతుక్కుంటారు. కుటుంబానికి మూలం అయిన చిరంజీవి నే తీసుకోండి స్వయంకృషితో ఎలాంటి రోల్ మోడల్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి తప్పటడుగులు వేస్తూనే ఉన్నత శిఖరంలా ఎదిగారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి మెగాస్టార్ (Mega Star)గా మారారు విమర్శించిననోళ్లతోనే పొగడ్తలు కురిపించేలాగా చేసుకున్నాడు.
We’re now on WhatsApp. Click to Join.
68 ఏళ్ల వయసులో కూడా ఇంకా నటించడానికి తపన పడుతున్నాడు. సంపాదించిన దాన్ని పదిమందికి పెట్టే గుణం ఉన్న చిరంజీవి సినిమా రంగంలో పని చేసే వాళ్లపైన దృష్టి పెట్టి వాళ్లకోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. కరోనా సమయంలో సినీ కార్మికులకు సాధారణ జనాలకు ఆక్సిజన్ సిలిండర్లు అందించే ఎంతోమంది ప్రాణాలని కాపాడాడు అలాగే బ్లడ్ బ్యాంక్ స్థాపించి ఎందరో ప్రాణాలు కాపాడాడు.
ఇండస్ట్రీలో ఉండే ఎంతోమంది అతని దగ్గర నుంచి ఏదో ఒక రకంగా సాయం పొందిన వారే ఇలాంటి వ్యక్తికి పొగడ్తలే కాదు పురస్కారాలు కూడా దాసోహం అయ్యాయి. ఉత్తమ నటుడిగా మూడు నంది అవార్డులు,ఏడు సౌత్ ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్న చిరంజీవి ఫిలిం ఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, రఘుపతి వెంకయ్య అవార్డు ఇలా ఎన్నో పురస్కారాలు ఆయనను వరించాయి. 2006లో పద్మభూషణ్ అందుకున్న చిరంజీవి 2024లో పద్మ విభూషణ్ అందుకోబోతున్నారు.
ఇక చిరంజీవి కొడుకుగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు రెండు నందులు ఒక సైమా పాప్ గోల్డెన్ అవార్డు అందుకున్నాడు. ఇక మేనల్లుడు అల్లు అర్జున్ అయితే ఏకంగా గత ఏడాది జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నాడు ఇక కోడలు ఉపాసన సంగతి చెప్పనే అక్కర్లేదు. వ్యాపారవేత్తగా సామాజిక కార్యకర్తగా అపోలో ఆసుపత్రిలో కీలక పదవిలో ఉంటూ తను చేసిన సామాజిక సేవలకు గాను మహాత్మా గాంధీ అవార్డు అందుకుంది.
Also Read: Chiranjeevi : ఈ గౌరవం మీదే అంటూ ఎమోషనల్ అవుతున్న చిరంజీవి.. మీ రుణం తీర్చుకోలేనంటున్న వైనం!