Chiranjeevi : ఈ గౌరవం మీదే అంటూ ఎమోషనల్ అవుతున్న చిరంజీవి.. మీ రుణం తీర్చుకోలేనంటున్న వైనం!
ఇప్పటికే ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న చిరంజీవికి (Chiranjeevi) ఇది మరొక అత్యున్నతమైన ఘనత అని చెప్పవచ్చు.
- By Vamsi Chowdary Korata Published Date - 11:34 AM, Sat - 27 January 24

Megastar Chiranjeevi : కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi) తాజాగా పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే ఇప్పటికే ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న చిరంజీవికి (Chiranjeevi) ఇది మరొక అత్యున్నతమైన ఘనత అని చెప్పవచ్చు. 1978లో కెరియర్ ప్రారంభించిన ఆయన 68 ఏళ్ళ వయసులో ఇప్పటికీ కూడా ఇంకా తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు అయితే మెగాస్టార్ కి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించడంపై ఆయన ఎమోషనల్ అవుతూ ఈ విధంగా ట్వీట్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించింది ఈ సమయంలో నాకు ఏం మాట్లాడాలో కూడా మాటలు రావడం లేదు మన దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ లభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిలా భావించి కోట్ల మంది ప్రజల ఆశీస్సులు సినీ కుటుంబ సభ్యులు అండదండలు నీడలా నాతో నడిచే లక్షలాదిమంది అభిమానుల ప్రేమ ఆదరణ కారణంగా నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నారు అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
నాపై మీరు చూపిస్తున్న కొండంత అభిమానానికి నేను ప్రతిగా ఇస్తున్నది గోరంత మాత్రమే. ఈ నిజం నాకు ప్రతిక్షణం గుర్తొస్తూనే ఉంటుంది నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తూ ఉంటుంది. నా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరపై వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తి మేరకు ప్రయత్నిస్తూనే ఉన్నాను.
నిజ జీవితంలో కూడా నా చుట్టూ ఉన్న ఈ సమాజంలో అవసరమైనప్పుడు నాకు చేతనైన సాయం చేస్తూనే ఉన్నాను. నన్ను ఇంతటి అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ పోస్టు ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. అదే ట్వీట్ కి కంగ్రాట్స్ అంటూ రి ట్వీట్ చేస్తున్నారు నెటిజన్స్.
Also Read: Sharmila : ఆ విషయంలో అన్న కంటే చెల్లెలు బెటర్.. షర్మిల ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే!