Sai Durga Tej : ముఖమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మెగా హీరో
ఇటీవల ఓ తండ్రి, కూతురుకు సంబంధంచిన వీడియోపై కొందరు వ్యక్తులు అనుచితంగా వీడియో చాట్ చేసిన ఘటన అందరికి తెలిసిందే. అయితే ఈ వీడియో విషయాన్ని హీరో సాయి దుర్గా తేజ్(Sai Durga Tej) తెరపైకి తెచ్చారు.
- By Latha Suma Published Date - 03:51 PM, Sun - 14 July 24

Sai Durga Tej: టాలీవుడ్ మెగా హీరో సాయి దుర్గా తేజ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలిశారు. సోషల్ మీడియా(Social media)లో ఇటీవల ఓ తండ్రి, కూతురుకు సంబంధంచిన వీడియోపై కొందరు వ్యక్తులు అనుచితంగా వీడియో చాట్ చేసిన ఘటన అందరికి తెలిసిందే. అయితే ఈ వీడియో విషయాన్ని హీరో సాయి దుర్గా తేజ్(Sai Durga Tej) తెరపైకి తెచ్చారు. తమ పిల్లలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తల్లిదండ్రులు సోషల్ మీడియాలో పోస్టు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన సాయి దుర్గా తేజ్… అదే సమయంలో, సోషల్ మీడియాలో అరాచకాలపై తగిన చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. తాజాగా, ఇదే అంశంపై సాయి దుర్గా తేజ్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దీనిపై ఆయన స్వయంగా సోషల్ మీడియా ద్వారా వివరాలు తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సందర్భంగా సాయి దుర్గాతేజ్ మాట్లాడుతూ..నా కోసం మీ విలువైన సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు సీఎం అన్న..పిల్లలపై అకృత్యాలు, సోషల్ మీడియా దుర్వినియోగంలాంటి విషయాలపై నేను చెప్పింది విని, అర్థం చేసుకుని, దీనిపై ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్లాలన్నదానిపై చర్చించినందుకు మీకు ధన్యవాదాలు. మన సమాజాన్ని పిల్లలకు సురక్షితమైన ప్రదేశంగా మార్చడానికి వీలు కల్పించే కఠినమైన నిబంధనలు, చర్యలకు శ్రీకారం చుడతామని మీరు హామీ ఇవ్వడం అభినందనీయం. సత్వరమే స్పందించి న్యాయం చేసేందుకు మీరు చూపిన నిబద్ధతకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇలాంటి సమస్యలపై నా సర్వశక్తులు ఒడ్డి పోరాడడం ఇక ముందు కూడా కొనసాగుతుంది అని సాయి దుర్గా తేజ్ ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పటి ఫొటోను కూడా ఆయన ఈ సందర్భంగా పంచుకున్నారు.
కాగా, తెలుగు యూట్యూబర్ ప్రణీల్ హనుమంతు ఇటీవలే తండ్రీకూతుళ్ల బంధంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. ప్రస్తుతం హనుమంతు చంచల్‌గూడలో జైలు జీవితం గడుపుతున్నాడు.
Read Also: Head Constable Posts : 112 హెడ్ కానిస్టేబుల్ జాబ్స్.. నెలకు రూ.81వేల దాకా శాలరీ