Ram Charan Tag : RC 16కి గ్లోబల్ స్టార్.. గేమ్ చేంజర్ కి కాదా..?
Ram Charan Tag RRR లో నటించిన ఇద్దరు హీరోలు తమ ట్యాగ్ నేం మార్చేసుకున్నారు. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్.టి.ఆర్ చేస్తున్న దేవర సినిమాకు మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే ట్యాగ్ ని తారక్ ఫిక్స్ చేసుకున్నాడు.
- By Ramesh Published Date - 09:25 PM, Tue - 26 March 24

Ram Charan Tag RRR లో నటించిన ఇద్దరు హీరోలు తమ ట్యాగ్ నేమ్ మార్చేసుకున్నారు. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్.టి.ఆర్ చేస్తున్న దేవర సినిమాకు మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే ట్యాగ్ ని తారక్ ఫిక్స్ చేసుకున్నాడు. దేవర ప్రచార చిత్రాల్లో ఎన్.టి.ఆర్ ముందు యంగ్ టైగర్ బదులుగా మ్యాన్ ఆఫ్ మాసెస్ అని వస్తుంది.
ఇక రాం చరణ్ కూడా మెగా పవర్ స్టార్ బదులుగా గ్లోబల్ స్టార్ అని ఫిక్స్ చేసుకున్నాడు. బుచ్చి బాబుతో చేస్తున్న RC16 అనౌన్స్ మెంట్ లో భాగంగా రాం చరణ్ ని గ్లోబల్ స్టార్ అని సంభోదించారు. అఫీషియల్ టైటిల్ కార్డ్ కూడా వేశారు.
అయితే లేటెస్ట్ గా గేమ్ చేంజర్ సాంగ్ రిలీజ్ టైం లో వదిలిన పోస్టర్ లో రాం చరణ్ ముందు మెగా పవర్ స్టార్ అని వేశారు. RC 16 కి మాత్రమే రాం చరణ్ గ్లోబల్ స్టారా.. గేమ్ చేంజర్ కి కాదా అని మెగా ఫ్యాన్స్ అడుగుతున్నారు. శంకర్ డైరెక్షన్ లో భారీ అంచనాలతో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా తో మరో హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు రాం చరణ్.
RRR తర్వాత ఆచార్య సినిమా చేసిన చరణ్ ఆ సినిమా తో ఫ్లాప్ ఫేస్ చేయగా గేమ్ చేంజర్ తో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. రాం చరణ్ శంకర్ ఫస్ట్ టైం కలిసి చేసిన గేమ్ చేంజర్ అవుట్ పుట్ అదిరిపోయిందని అంటున్నారు. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అన్నది బుధవారం రాం చరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.
Also Read : Tillu Square Release Trailer : టిల్లు స్క్వేర్ మరోటి వదులుతున్నారా..? పక్కా ప్లానింగ్ తోనే వస్తున్నారు..!