Floods in AP & TG : వరద బాధితులకు మహేష్ , పవన్ కళ్యాణ్ లు భారీ విరాళం
సూపర్ స్టార్ మహేష్ బాబు , పవర్ స్టార్ , జనసేన ధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు భారీ విరాళం ప్రకటించారు
- By Sudheer Published Date - 09:54 PM, Tue - 3 September 24
తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు చిత్రసీమ కదిలివస్తుంది. తమకు తోచిన ఆర్ధిక సాయాన్ని ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోలు, నిర్మాతలు , డైరెక్టర్లు సాయం ప్రకటించగా..తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) , పవర్ స్టార్ , జనసేన ధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లు భారీ విరాళం ప్రకటించారు.
తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు (Floods in AP & Telangana) అపార నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తడంతో లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో రెండు ప్రభుత్వాలు , రాజకీయ పార్టీలు సహాయక చర్యలు మొదలుపెట్టాయి. ఇదే క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు మంచి మనసుతో ముందుకు రావాలని ఇరు సీఎంలు కోరడం తో ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. గతంలో పలు విపత్తులు ఎదురైనప్పుడు తమ వంతు సాయం చేసిన చిత్రసీమ..ఇప్పుడు కూడా తెలుగు రాష్ట్రాల కోసం తమ వంతు సాయం ప్రకటిస్తున్నారు.
తాజాగా వరద బాధితులకు పవన్ కళ్యాణ్ రూ.కోటి విరాళం ప్రకటించారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు రూ. కోటి ఆర్థిక సాయం ప్రకటించారు. ఇరు రాష్ట్రాలకు చెరొక రూ.50 లక్షల సాయం చేస్తున్నట్లు తెలిపారు. హీరోయిన్ అనన్య నాగళ్ల రెండు రాష్ట్రాలకు కలిపి రూ.5 లక్షల సాయం అందించారు. హీరో సందీప్ కిషన్ తన వంతుగా సహాయం చేశారు. బాధితులకు ఆయన టీమ్ ఆహారాన్ని అందించింది. అక్కడే ఉన్న ఐఏఎస్ అధికారి లక్ష్మీ షా వారిని అభినందించారు. కష్ట సమయంలో ఇలా ముందుకు రావడం గొప్ప విషయమని కొనియాడారు.
ఇప్పటి వరకు సహాయం ప్రకటించిన సెలబ్రిటీలు వీరే..
ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ (Vijayanthi Movies) ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షల విరాళాన్ని ప్రకటించింది. ‘ఆయ్’ చిత్రానికి సోమవారం నుంచి వారాంతం వరకూ వచ్చే కలెక్షన్లలో 25 శాతం ఆదాయాన్ని జనసేన పార్టీ ద్వారా వరద బాధితులకు విరాళంగా అందజేస్తామని చిత్ర నిర్మాత బన్నీ వాసు ప్రకటించారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) సైతం తెలుగు రాష్ట్రాల వరదలపై స్పందిస్తూ తమ సానుభూతి తెలియజేశారు. ‘భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న వరద బీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.’ అంటూ తన సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఏపీ సీఎం సహాయ నిధికి రూ.5 లక్షలు, తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ.5 లక్షల చొప్పున విరాళం అందజేశారు.
ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, ఎస్. రాధాకృష్ణ, ఎస్ నాగవంశీలు సంయుక్తంగా తమ హారిక, హసిని క్రియేషన్స్, సితార ఎంటర్ టైన్మెంట్స్ తరుపున ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.25 లక్షలు, తెలంగాణలకు రూ.25 లక్షల చొప్పున మొత్తంగా రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు. బాలకృష్ణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెరొక రూ.50 లక్షలు ప్రకటించారు. జూ. ఎన్టీఆర్ రెండు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయిలు ప్రకటించారు. సిద్ధు జొన్నలగడ్డ- ఏపీకి రూ. 15 లక్షలు, తెలంగాణకు రూ. 15 లక్షలు, డైరెక్టర్ వెంకీ అట్లూరి- ఏపీకి రూ. 5 లక్షలు, తెలంగాణకు రూ. 5 లక్షలు ప్రకటించారు. వీరి బాటలోనే మిగతా హీరోలు , నిర్మాతలు కూడా తమ వంతు సాయం అందజేసేందుకు ముందుకు వస్తున్నారు.
Read Also : Vijayawada Floods: వరద బాధితులకు విరాళాలు కోరిన సీఎం చంద్రబాబు
Related News
TDP-JanaSena : టీడీపీ, జనసేన వర్గాల మధ్య విభేదాలు..!
Differences between TDP-Jana Sena: కృష్ణా జిల్లాలో అధికార కూటమి పార్టీలో వర్గ విభేదాలు తలెత్తాయి. మచిలీపట్నంలో బ్యానర్ విషయంలో టీడీపీ, జనసేన వర్గాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో.. బ్యానర్ గొడవ తారస్థాయికి చేరుకుంది.