MLA Pantham Nanaji Apology : క్షమాపణలు కోరిన జనసేన ఎమ్మెల్యే ..రేపు దీక్ష చేస్తానని ప్రకటన
MLA Pantham Nanaji : పరిహారంగా రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తన ఇంటి వద్ద ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నట్లు నానాజీ
- By Sudheer Published Date - 10:02 PM, Sun - 22 September 24

MLA Pantham Nanaji : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో కాకినాడ రూరల్ MLA పంతం నానాజీ (MLA Pantham Nanaji) సైతం ప్రాయశ్చిత్త దీక్ష (Prayaschitta Deeksha)కు సిద్ధమయ్యారు. నిన్న కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ వద్ద డాక్టర్ ను బూతులు తిడుతూ పంతం నానాజీ దుర్భాషలాడిన సంగతి తెలిసిందే.
దీనితో గవర్నమెంట్ డాక్టర్ల అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డాక్టర్ పై దాడి చేసిన పంతం నానాజీపై చర్యలు తీసుకోకుంటే వెంటనే ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తూ లేఖ రాశారు. అక్కడ చదువుకున్న వారు డాక్టర్లుగా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖమైన స్థానాల్లో ఉన్నారు. అంత చరిత్ర ఉన్న రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్లో బాస్కెట్ బాల్ ఆడుకుంటామంటూ కొందరు అనుచరులు ఎమ్మెల్యే పంతం నానాజీని అడిగారు. వారికోసం నానాజీ మెడికల్ కాలేజీ యాజమాన్యాన్ని అనుమతి కోరారు. అది ఇంకా పెండింగ్ లో ఉంది. ఈలోపులోనే ఆయన అనుచరులు కొందరు కాలేజీ గ్రౌండ్లో నెట్ కట్టడానికి ప్రయత్నించారు. దీనిని అక్కడ ఉన్న సిబ్బంది అడ్డుకున్నారు.
ఎమ్మెల్యే అనుచరుల పేరుతో కొందరు కాలేజీ బాస్కెట్బాల్ గ్రౌండ్ ను ఆక్రమించి అక్కడ చట్ట వ్యతిరేకమైన పనులు, బెట్టింగులు, మహిళా స్టూడెంట్ లు ఉన్న కాలేజ్ ప్రాంతంలో న్యూసెన్స్ కు పాల్పడుతున్నారని అవి వద్దు అని చెప్పినందుకు ఇలా ఎమ్మెల్యేను తీసుకొచ్చి దౌర్జన్యానికి దిగారని లేఖ ను రిలీజ్ చేశారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తమ ప్రొఫెసర్ డాక్టర్ ఉమామహేశ్వరరావుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని అలాగే ఎమ్మెల్యే అనుచరులమంటూ దాడి చేసిన పై వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే నానాజీ బూతుల దండకపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేను మందలించినట్లు సమాచారం. దీంతో తన తప్పును తెలుసుకున్న ఎమ్మెల్యే క్షేమపణలు కోరారు. దీనికి పరిహారంగా రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తన ఇంటి వద్ద ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నట్లు నానాజీ స్వయంగా ప్రకటించారు.
Read Also : Chiranjeevi’s Guinness Record : చిరంజీవికి అభినందనలు తెలిపిన తెలుగు సీఎంలు