Janhvi Kapoor: పెద్ది నుంచి అదిరిపోయే అప్డేట్.. చరణ్ మూవీలో జాన్వీ పాత్ర ఇదే!
వి. సత్య సతీష్ కిలారు ఈ చిత్రాన్ని కనీవినీ ఎరుగని స్థాయిలో భారీగా నిర్మిస్తున్నారు. లెజెండరీ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
- By Gopichand Published Date - 04:02 PM, Sat - 1 November 25
Janhvi Kapoor: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ (Peddi) చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా గ్లింప్స్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి, సినిమాపై విపరీతమైన ఆసక్తిని పెంచింది. ఈ నేపథ్యంలో నిర్మాతలు తాజాగా ఈ చిత్రంలో కథానాయిక జాన్వీ కపూర్ (Janhvi Kapoor) లుక్, పాత్ర పేరును వెల్లడించారు.
ఒక మాసీ అవతార్‌లో జాన్వీ కపూర్ ఆచియమ్మగా భయం లేని, ఆవేశపూరితమైన లుక్‌లో కనిపిస్తున్నారు. నిర్మాతలు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు నటిలో అద్భుతమైన పరివర్తనను చూపుతూ సినిమా పల్లెటూరి నేపథ్యాన్ని, శక్తివంతమైన సౌందర్యాన్ని బలపరుస్తున్నాయి.
Also Read: SBI Card: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడేవారికి బిగ్ అలర్ట్!
Our #Peddi's love with a firebrand attitude 😎🔥
Presenting the gorgeous #JanhviKapoor as #Achiyyamma ❤🔥#PEDDI GLOBAL RELEASE ON 27th MARCH, 2026.
Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @NavinNooli… pic.twitter.com/LFsESjTmYK
— PEDDI (@PeddiMovieOffl) November 1, 2025
జాన్వీ కపూర్ డ్యుయల్ టోన్
ఒక పోస్టర్‌లో జాన్వీ కపూర్ ఒక రస్టిక్ ప్రింటెడ్ చీర, సాంప్రదాయ ఆభరణాలు ధరించి మనల్ని ఆ పాత కాలంలోకి తీసుకెళ్లేలా ఉంది. రెండవ పోస్టర్ ఆమె పాత్ర ధైర్యమైన తెగువను, సామాజిక ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది. ఈ పోస్టర్‌లో ఆమె నీలి రంగు చీర ధరించి, జీప్ పై నుంచి పెద్ద జనసమూహానికి అభివాదం చేస్తూ కనిపిస్తుంది. ఈ రెండు పోస్టర్ల ద్వారా జాన్వీ కపూర్ తన పాత్ర ద్వంద్వ స్వభావాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ సహజమైన, పల్లెటూరి కథాంశంలో పల్లెపడుచు పాత్రకు ఆమె సరిగ్గా సరిపోయారని తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన చరణ్ లుక్స్, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.
వి. సత్య సతీష్ కిలారు ఈ చిత్రాన్ని కనీవినీ ఎరుగని స్థాయిలో భారీగా నిర్మిస్తున్నారు. లెజెండరీ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పాన్-ఇండియా చిత్రం అద్భుతమైన స్థాయికి అనుగుణంగా ఆయన పాటలు ఇటీవల కాలంలో ఆయన అందించిన అత్యుత్తమ సంగీతంగా నిలుస్తాయని చెబుతున్నారు. ‘పెద్ది’ చిత్రం మార్చి 27, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధమవుతోంది.