SBI Card: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడేవారికి బిగ్ అలర్ట్!
సాధారణ కార్డుల కోసం రూ. 100 నుండి రూ. 250 వరకు అయితే ప్రీమియం ఆరమ్ కార్డ్ కోసం రూ. 1,500 వరకు రుసుము వసూలు చేస్తారు.
- By Gopichand Published Date - 03:01 PM, Sat - 1 November 25
SBI Card: మీరు మీ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ (SBI Card) ఉపయోగించి పేటీఎం, ఫోన్ పే, Razorpay లేదా ఇతర థర్డ్-పార్టీ యాప్‌ల ద్వారా స్కూల్ లేదా కాలేజీ ఫీజు చెల్లిస్తే 1% ట్రాన్సాక్షన్ ఛార్జ్ వర్తిస్తుంది. అయితే మీరు నేరుగా స్కూల్ లేదా కాలేజీ వెబ్‌సైట్ లేదా వారి POS మెషిన్ ద్వారా చెల్లింపు చేస్తే ఎటువంటి అదనపు రుసుము ఉండదు. అంటే విద్యా సంబంధిత చెల్లింపుల ప్లాట్‌ఫారమ్‌ను ఎంచుకునేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి.
మీ వాలెట్‌లో డబ్బు జమ చేసినా ఛార్జ్ పడుతుంది
కొత్త నియమం ప్రకారం.. మీరు ఏదైనా డిజిటల్ వాలెట్ అంటే Paytm Wallet, Amazon Pay లేదా MobiKwikలలో రూ. 1,000 కంటే ఎక్కువ జమ చేస్తే మీరు 1% ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు మీ వాలెట్‌లో రూ. 2,000 జమ చేస్తే, రూ. 20 ఛార్జ్ తీసివేయబడుతుంది. మీ వాలెట్‌లో రూ. 1,980 మాత్రమే జమ అవుతాయి.
Also Read: India vs South Africa: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. వర్షం పడితే సౌతాఫ్రికాదే ట్రోఫీ!
ఎస్‌బీఐ కార్డ్‌పై విధించే ఇతర ముఖ్యమైన ఛార్జీలు
నగదు చెల్లింపు రుసుము (Cash Payment Fee): మీరు మీ బిల్లును నగదు రూపంలో చెల్లిస్తే రూ. 250 రుసుము వసూలు చేయబడుతుంది.
చెల్లింపు తిరస్కరణ రుసుము (Payment Dishonor/Bounce Fee): మీ చెల్లింపు విఫలమైతే లేదా బౌన్స్ అయితే చెల్లింపు మొత్తంలో 2% లేదా కనీసం రూ. 500 (వీటిలో ఏది ఎక్కువైతే అది) ఛార్జ్ విధించబడుతుంది.
చెక్ చెల్లింపు రుసుము: చెక్ ద్వారా చెల్లింపు చేస్తే ఇప్పుడు రూ. 200 రుసుము వసూలు చేయబడుతుంది.
నగదు అడ్వాన్స్ రుసుము: ఏటీఎం నుండి నగదు విత్‌డ్రా చేస్తే ట్రాన్సాక్షన్ మొత్తంలో 2.5% లేదా రూ. 500 (వీటిలో ఏది ఎక్కువైతే అది) వసూలు చేస్తారు. ఈ నియమం భారతదేశంలో, విదేశాలలో కూడా వర్తిస్తుంది.
కార్డ్ రీప్లేస్‌మెంట్ రుసుము: సాధారణ కార్డుల కోసం రూ. 100 నుండి రూ. 250 వరకు అయితే ప్రీమియం ఆరమ్ కార్డ్ కోసం రూ. 1,500 వరకు రుసుము వసూలు చేస్తారు.