Shruthi Haasan: శ్రుతి హాసన్ అంటే కమల్ హాసన్ కూతురు అనే విషయాన్ని మరచిపోయేలా చేయాలి: స్టార్ హీరోయిన్
తాజాగా హీరోయిన్ శృతిహాసన్ ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ చాలా ఆసక్తికర విషయాలను వెల్లడించింది .
- By Anshu Published Date - 02:00 PM, Sat - 8 March 25

టాలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొన్నటి వరకు వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కాస్త స్పీడును తగ్గించింది. సలార్, భగవత్ కేసరి, వాల్తేరు వీరయ్య వంటి సినిమాలతో బ్యాటరీ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. కానీ ప్రస్తుతం కాస్త జోరు తగ్గించింది అని చెప్పాలి. ఆ సంగతి పక్కన పెడితే నేడు మహిళా దినోత్సవం సందర్భంగా హీరోయిన్ శృతిహాసన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా శృతిహాసన్ మాట్లాడుతూ ఎన్నో విషయాలను పంచుకున్నారు.
మీ అమ్మగారి కెరీర్‌ని చూశారు. అప్పటి ఆమె కెరీర్ పరిస్థితులను ఇప్పటి మీ కెరీర్‌తో పోల్చుకున్నప్పుడు ఏమనిపిస్తోంది? అని అడగగా అప్పటి పరిస్థితుల గురించి అమ్మ నాతో చెప్పేవారు. ఈక్వాలిటీ విషయంలో అప్పుడు ప్రాబ్లమ్ ఉండేదట. ఉమెన్ కి చాలా తక్కువప్రాధాన్యం ఉండేదట. అలాగే అప్పట్లో పీరియడ్స్ గురించి బాహాటంగా మాట్లాడడానికి సిగ్గుపడేవాళ్లు. అసలు బయటకు చెప్పకూడదన్నట్లు ఉండేది. ఇబ్బందిగా ఉన్నా బయటకు చెప్పకుండా షూటింగ్ చేసేవాళ్లు. ఇప్పుడు పీరియడ్స్ ఇబ్బంది గురించి ఓపెన్‌గా చెప్పి, ఆ రోజు పని మానుకునే వీలు ఉంది.
ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్న నటీమణులు చాలామంది ఉన్నారు. మీకు అలాంటివి? అని ప్రశ్నించగా.. నాకు అలాంటి చేదు అనుభవాలు లేవు. ఒకవేళ నాకు నచ్చని పరిస్థితి ఎదురైందంటే నిర్మొహమాటంగా చెప్పేస్తాను. నా పాలసీ ఒక్కటే. నేను ఎవరినైనా ఇష్టపడితే టూ హండ్రెడ్ పర్సెంట్ ఇష్టపడతాను. నాకు కంఫర్ట్‌గా ఉన్న చోట ఉంటాను అని తెలిపింద. కమల్ హాసన్‌గారి కూతురు కావడం వల్లే మీకు ఇండస్ట్రీలో ఇబ్బందులు ఎదురు కాలేదనుకోవచ్చా? అని అడగగా.. బ్యాక్ గ్రౌండ్ అనేది ప్లస్సే. కాదనడం లేదు. నాన్నగారి పేరు నాకు హెల్ప్ అయింది. అయితే శృతి హాసన్ అంటే కమల్ హాసన్ కూతురు అనే విషయాన్ని మరచిపోయేలా చేయాలి. అప్పుడే నేను సక్సెస్ అయినట్లు. నా వర్క్‌తో నేను నిరూపించుకుని నాకంటూ పేరు తెచ్చుకున్నాను. పని పరమైన ఇబ్బందులు కామన్. అలాంటివి ఎప్పుడూ మా నాన్నగారికి చెప్పలేదు. నేనే సాల్వ్ చేసుకుంటుంటాను అని చెప్పుకొచ్చింది శృతిహాసన్.