Ileana Pregnancy: తల్లి కాబోతున్న ఇలియానా.. ప్రెగ్నెన్సీని ప్రకటించిన గోవా బ్యూటీ..!
బాలీవుడ్ నటి ఇలియానా (Ileana) తల్లి కాబోతున్నారు. ప్రస్తుతం నటనకు దూరంగా ఉన్న ఇలియానా తన వ్యక్తిగత జీవితం, ఇతర విషయాలు సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు తెలియజేస్తూ ఉంటుంది.
- By Gopichand Published Date - 09:51 AM, Tue - 18 April 23
బాలీవుడ్ నటి ఇలియానా (Ileana) తల్లి కాబోతున్నారు. ప్రస్తుతం నటనకు దూరంగా ఉన్న ఇలియానా తన వ్యక్తిగత జీవితం, ఇతర విషయాలు సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు తెలియజేస్తూ ఉంటుంది. నటి మంగళవారం ఉదయం తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్‌ను పంచుకుంది. అందులో ఏం ఉందంటే.. త్వరలోనే వస్తుంది. నా చిన్ని ప్రియతమా నిన్ను కలవడానికి వేచి ఉండలేను అని 2 ఫోటోలను షేర్ చేసింది.
ఇలియానా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రెండు చిత్రాలను షేర్ చేసింది. వీటిలో ఒకదానిలో న్యూ బోర్న్ బేబీ బాడీసూట్ కనిపిస్తుంది. దానిపై ‘అబ్ అడ్వెంచర్ షురు హోతా హై’ అని వ్రాయబడింది. అదే సమయంలో రెండవ చిత్రంలో ఒక లాకెట్టు కనిపిస్తుంది. దానిపై ‘మామా’ అని వ్రాయబడింది. ఇలియానా ద్వారా షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో ఇది చూసిన నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు చెప్తున్నారు.
Actor #IleanaDcruz announced her pregnancy on social media with a sweet post on Tuesday morning.
Photo: Ileana D'Cruz Instagram
Read: https://t.co/bsRVvI3RbM pic.twitter.com/fk3JUYDA9N
— editorji (@editorji) April 18, 2023
Also Read: Muttiah Muralitharan : శ్రీలంక మాజీ స్టార్ క్రికెటర్ బయోపిక్ ఇండియాలో.. ఫస్ట్ లుక్ పోస్టర్ చూశారా?
రణబీర్ కపూర్, ప్రియాంక చోప్రా జంటగా ‘బర్ఫీ’ సినిమాలో కనిపించిన ఇలియానా చేసిన ఈ పోస్ట్ చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలియానాకు ఇంకా పెళ్లి కాలేదు. ఇలియానా డి’క్రూజ్ పోస్ట్‌పై స్పందించిన నెటిజన్లు ‘మీకు ఎప్పుడు వివాహం జరిగింది?’ అని, ఇంకొకరు ‘బిడ్డకు తండ్రి ఎవరు?’ అని కామెంట్ చేస్తున్నారు. ఇలియానా పెళ్లి ఊసేలేకుండా ఏకంగా గర్భవతి అనే విషయం తెలియడంతో అందరి మైండ్ బ్లాంక్ అయిపోతోంది. ఆమె నిజంగా గర్భం దాల్చిందా? లేక పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనా అనేది జనాల్లో డిస్కషన్ పాయింట్ అయింది. అయితే ఇలియానా ఈ పోస్ట్ ద్వారా తాను గర్భవతి అని స్పష్టం చేయలేదు. ఈ చిత్రాలను చూసిన అభిమానులు ఆమె గర్భవతి అని చర్చించుకుంటున్నారు.
ఇలియానా డిక్రూజ్ చిత్రాలపై ఆమె తల్లి సమీరా డిక్రూజ్ కూడా స్పందించారు. ఇలియానా తల్లి ‘ఈ ప్రపంచంలో త్వరలో నీకు స్వాగతం. నా కొత్త గ్రాండ్ బేబీ మిమ్మల్ని కలవడానికి వేచి ఉండలేను’ అని రాశారు. గతంలో ఇలియానా ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో రిలేషన్ లో ఉన్న ఈ బ్యూటీ అతడితో బ్రేకప్ తర్వాత కత్రినా కైఫ్ సోదరుడు స్టెబాస్టిన్ తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారని, విడిపోయారని కూడా వార్తలు వచ్చాయి. దేవదాస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది గోవా బ్యూటీ ఇలియానా. ఆ తర్వాత వరుస ఆఫర్స్ కొట్టేసింది. పోకిరి, కిక్ లాంటి సినిమాలతో స్టార్ స్టేటస్ కూడా పట్టేసింది. అయితే టాలీవుడ్ లో మెల్లగా అవకాశాలు సన్నగిల్లుతుండటం బాలీవుడ్ పై ఇలియానా దృష్ఠి సారించింది. అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అయితే అక్కడ మాత్రం అనుకున్నంత మేర రాణించలేకపోతోంది.
Related News
Vijay Devarakonda The Family Star OTT Talk : ది ఫ్యామిలీ స్టార్.. OTT టాక్ ఎలా ఉందంటే..?
సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే థియేటర్ కి వెళ్లి వేలకు వేలకు ఖర్చు పెట్టే రిస్క్ చేయట్లేదు. అందుకే కొన్ని సినిమాలు ఓటీటీ రిలీజ్ కోసం