Allu Ayan: షారుక్ ఖాన్ పాటను అద్భుతంగా పాడిన అల్లు అయాన్.. నెట్టింట వీడియో వైరల్?
- By Sailaja Reddy Published Date - 11:00 AM, Sun - 25 February 24
తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కొడుకు అల్లు అయాన్ ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ కిడ్స్ లో ఉన్న వీరు కూడా ఒకరు. అల్లు అయాన్ గురించి ఈ పక్కన పెడితే అల్లుహా తరచూ ఏదోక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. అల్లు అయాన్ చాలా తక్కువగా మాత్రమే వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఈ స్టార్ కిడ్స్ చిన్నతనంలోనే తమ సత్తా చాటుతున్నారు. సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ పెంచుకుంటూ ఇండస్ట్రీలో ముందే కర్చీఫ్ వేసుకుంటున్నారు.
ఈ విషయంలో మహేష్ బాబు కూతురు సితారతో పాటు అల్లు అర్జున్ పిల్లలు ఇద్దరు ముందున్నారు. ఇటీవల కాలంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ కూతురు అర్హా కూడా ఇండస్ట్రీలో పాపులర్ అవుతున్నారు. ఇప్పటికే అర్హ ఒక సినిమా కూడా చేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో వీడియోలతో అదరగొడుతోంది. అటు అయాన్ కూడా సినిమాల్లోకి రాకుముందే మంచి పాపులారిటీని సంపాదించుకుంటాడు. దాదాపు 10 ఏళ్ళ వయసు ఉన్న అయాన్ తన అల్లరితో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాడు. తను చేసే చిలిపి పనులకు అల్లు ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఫిదా అవుతుంటారు.
Lut putt gaya #AlluAyaan version 😂 @iamsrk
#AlluArjun𓃵 pic.twitter.com/gWWRAsPG2z— EPIC _Tweetz🪓🐉 (@saytruth93) February 24, 2024
ఇక అయాన్ అల్లరికి అభిమానుల తెగ ఖుషీ అవుతుంటారు. ఈ క్రమంలో అల్లు అయాన్ని మోడల్ అంటూ ముద్దుగా పిలుచుకోవడం స్టార్ట్ చేసారు. ఇక అభిమానులతో పాటు బన్నీ కూడా అయాన్ ను మోడల్ అయాన్ అనే పిలుస్తున్నాడట. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా అయాన్ కు సబంధించిన మరో వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయాన్ పాట పాడుతున్నాడు అది కూడా తెలుగు పాట కాదు హిందీ సాంగ్. షారుఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమాలోని లుటు పుటు గయా పాటని.. పాడుతుండగా తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆ పాటను ఎంతో చక్కగా పాడి ప్రేక్షకులను మెప్పించాడు అయాన్. అల్లు అయాన్ సరదాకి హమ్ చేసినా.. పాట మాత్రం బాగా పాడాడు. దాంతో ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
Related News
Samyukta Menon : టాలీవుడ్ పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. అక్కడ నటించాలంటే కష్టం అంటూ..!
Samyukta Menon టాలీవుడ్ సినిమాలతో స్టార్ క్రేజ్ తెచ్చుకుని సౌత్ లో సూపర్ పాపులర్ అవుతున్న హీరోయిన్స్ ఒక పాయింట్ లో తెలుగు సినీ పరిశ్రమపై కామెంట్స్