HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Fire In The Manchu Family Growing Sympathy For Manoj

Manoj Sympathy: మంచు ఫ్యామిలీలో మంట‌లు.. మ‌నోజ్‌కు పెరుగుతున్న సానుభూతి!

మోహన్ బాబు మీడియా ప్రతినిధి దాడి వ్యవహారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పందించారు. దాడి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.

  • Author : Gopi Date : 10-12-2024 - 11:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Manchu Family
Manchu Family

Manoj Sympathy: మంచు ఫ్యామిలీ వివాదంలో మోహ‌న్ బాబు, విష్ణుల‌పై తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇదే స‌మ‌యంలో మ‌నోజ్‌కు అన్ని వ‌ర్గాల నుంచి సానుభూతి (Manoj Sympathy) పెరుగుతోంది. ఇప్ప‌టికే మోహ‌న్ బాబు మీడియాపై దాడి చేయ‌డంతో ఆయ‌న‌పై వ్య‌తిరేక‌త వ‌స్తోంది. మ‌రోవైపు విష్ణు సైతం త‌న బౌన్స‌ర్ల‌తో మ‌నోజ్‌, మీడియాల‌పై దాడికి య‌త్నించాడు. ఈ ఇష్యూలో మ‌నోజ్‌కు సానుభూతి పెరుగుతున్న‌ట్ల స్పష్టంగా అర్థమవుతోంది. ఈ క్ర‌మంలోనే మోహ‌న్ బాబుపై ప‌లువురు నెగిటివ్‌గా కామెంట్లు చేస్తున్నారు.

మంత్రి పొంగులేటి స్పంద‌న‌

మోహన్ బాబు మీడియా ప్రతినిధి దాడి వ్యవహారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పందించారు. దాడి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. అనంతరం జర్నలిస్టుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. దీనిపై పార్టీలకు అతీతంగా అందరూ స్పందిస్తున్నారు. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌ స్పందించి ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదని అన్నారు. మ‌రోవైపు బీజేపీ ఎంపీ ర‌ఘునంద‌న్ రావు కూడా మోహ‌న్ బాబు వైఖ‌రిని త‌ప్పుబ‌ట్టారు.

Also Read: Suicide Attempt: మోహన్‌ బాబు ఇంటి పని మనిషి ఆత్మహత్యాయత్నం?

మీడియా ప్రతినిధిపై దాడిని ఖండిస్తున్నా: కేఏ పాల్

నటుడు మోహన్‌బాబు ఓ మీడియా ప్రతినిధిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. ఎవరైనా సరే.. ఎంత పెద్దవారైనా మీడియాపై దాడి చేయడం అనేది సరికాదన్నారు. దాడి ఘటనపై వెంటనే మోహన్‌బాబు మీడియా ప్రతినిధులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

మంచు మోహన్ బాబు ఓ జర్నలిస్టుపై చేసిన దాడిని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌషిక్ యాదవ్ ఖండించారు. మీడియా ప్రతినిధి పై దాడి చేయడం సరి కాదని మండిపడ్డారు. తగాదాలు ఉంటే మంచు ఫ్యామిలీ ఇంట్లో కూర్చోని చర్చించుకోవాలన్నారు.

మీడియాపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ట్వీట్ చేశారు. అయ్యప్ప మాలలో ఉన్న మీడియా ప్రతినిధిపై దాడి సిగ్గు చేటు, అమానుషమని అన్నారు. అంతకుముందు తన ఇంటి వద్దకు వచ్చిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దుర్భాషలాడుతూ, దాడికి పాల్పడ్డారు.

మోహ‌న్ బాబును అరెస్ట్ చేస్తారా?

కుటుంబంలో జరుగుతున్న వివాదంలో మోహన్ బాబు ఆవేశపడి మీడియాపై దాడి చేయడం, తన కుమార్తె కోసం ఇంటికి వచ్చిన మంచు మనోజ్‌పై దాడి చేయడంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు పెట్టాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు మోహన్ బాబు మీడియా ప్రతినిధి వద్ద మైక్ లాక్కుని చేసిన దాడిలో ఇద్దరికి గాయాలయ్యాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • Manchu Family Issues
  • manchu manoj
  • Manchu Mohan Babu
  • manchu vishnu
  • Manoj Sympathy
  • Police Cases
  • police station
  • telugu news
  • tollywood

Related News

International Thalassemia Day

Nara Bhuvaneswari: ‘తలసేమియా రన్’ వ్యాధిపై అవగాహన కల్పించి చిన్నారులు అండగా నిలవాలని నారా భువనేశ్వరి

తలసేమియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆదివారం హైదరాబాద్‌లో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగరంలోని నెక్లెస్ రోడ్డులో ‘తలసేమియా రన్’ను ఘనంగా నిర్వహించింది. జలవిహార్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. ఈ పరుగులో 3K, 5K, 10K విభా

  • Retired IPS Officer Wife Incident in Jubilee Hills

    Hyderabad: జూబ్లీహిల్స్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య

  • Legendary producer R. B. Choudary has passed away

    Rb Choudary: టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రముఖ సూపర్‌గుడ్‌ నిర్మాత ఆర్బీ చౌదరి దుర్మరణం

  • Fauji Movie

    Fauzi: ప్రభాస్ ఫౌజీ షూటింగ్‌లో.. ఒకరు మృతి.. ఐదుగురికి తీవ్ర గాయాలు

Latest News

  • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

  • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

  • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

  • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

  • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd