Ananya Nagalla: శ్రీవారి సేవలో హీరోయిన్ అనన్య నాగళ్ల.. ఫోటోస్ వైరల్?
- Author : Sailaja Reddy
Date : 19-03-2024 - 11:00 IST
Published By : Hashtagu Telugu Desk
తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న అనన్య నాగళ్ల ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. అలాగే ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. అలాగే ఈమె ప్రియదర్శి ప్రధానపాత్రలో తెరకెక్కిన మల్లేశం సినిమాలో కూడా హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా మంచి సూపర్ హిట్ సాధించడంతో ఈమె క్రేజ్ మరింత పెరిగింది.
దీంతో ఈమెకు తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇటీవల కాలంలో ఈమె సినిమాలలో నటించకపోయినప్పటికీ తరచూ ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తూనే ఉంది. ముఖ్యంగా బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ ఫోటో షూట్ చేస్తూ యువత దృష్టిని ఆకర్షిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇది ఇలా ఉంటే తాజాగా హీరోయిన్ అనన్యనాగళ్ళ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంది. సోమవారం ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
ఆలయం వెలుపల అనన్యనాగళ్ళ మీడియాతో మాట్లాడుతూ.. తంత్రా సినిమా ఘనవిజయం సాధించింది. స్వామి వారి ఆశీస్సులతో సినిమా ఘనవిజయం సాధించింది అని తెలిపారు అనన్యనాగళ్ళ. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, పోట్టేల్ సినిమాలో నటిస్తున్నట్లు తెలిపారు. అనేక సినిమాల్లో నటించిన అనన్య.. పవన్ కళ్యాణ్ తో నటించిన వకీల్ సాబ్ సినిమాతో ఫేమ్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం అనేక సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.