HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >The Budget Gave A Big Shock To China

Budget 2026 -27 : చైనాకు బిగ్ షాక్ ఇచ్చిన బడ్జెట్ !!

దేశంలో సెమీకండక్టర్ రంగాన్ని పటిష్టం చేసేందుకు నిర్మల సీతారామన్ కీలక ప్రతిపాదనలను ప్రకటించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM) 2.0 ను ప్రారంభించినట్లు వెల్లడించారు. తొలి దశ విజయవంతమైన నేపథ్యంలో- ఇక దేశీయ సెమీకండక్టర్ వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ మిషన్ ప్రధాన

  • Author : Sudheer Date : 01-02-2026 - 1:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nirmala Shock To China
Nirmala Shock To China

Budget 2026 -27 : పక్కలో బల్లెంలా మారిన పొరుగుదేశం చైనాకు బిగ్ షాక్ తగిలింది. వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను సభలో ప్రవేశపెడుతున్న వేళ.. తన ఉపన్యాసం ప్రారంభంలోనే సంచలన విషయాన్ని వెల్లడించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్. ఓ భారీ ప్రాజెక్ట్ ను ప్రకటించారు. దీనివల్ల చైనపై ఆధార పడాల్సిన అవసరం భారత్ కు ఏమాత్రం కూడా ఉండబోదు. ఫలితంగా- కొద్దో గొప్పో ఆ దేశ ఆర్థిక రంగానికి భారత్ అందిస్తోన్న సహకారానికి చెక్ పడినట్టవుతుంది.

దేశంలో సెమీకండక్టర్ రంగాన్ని పటిష్టం చేసేందుకు నిర్మల సీతారామన్ కీలక ప్రతిపాదనలను ప్రకటించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM) 2.0 ను ప్రారంభించినట్లు వెల్లడించారు. తొలి దశ విజయవంతమైన నేపథ్యంలో- ఇక దేశీయ సెమీకండక్టర్ వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ మిషన్ ప్రధాన ఉద్దేశమని వివరించారు. దీనివల్ల చిప్, సెమీకండక్టర్లను చైనా సహా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం తగ్గుతుంది.

ఈ సెమీకండక్టర్ మిషన్ 2.0 అసెంబ్లింగ్ నుండి పరిశోధనల వైపు దృష్టి సారిస్తుందని తెలిపారు. దీన్ని మరింత విస్తరించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. దీనికోసం బడ్జెట్ లో 40,000 కోట్ల రూపాయలను కేటాయించినట్లు వివరించారు. దీన్ని- సెమీకండక్టర్ పరికరాలు, ఉత్పత్తి నుండి స్వదేశీ ఐపీ డిజైన్‌తో పాటు 45 కీలక సప్లై చైన్ ల వరకు విస్తరిస్తామని, ప్రపంచ చిప్ కొరత మధ్య నిఖార్సయిన ఆత్మనిర్భరతను సాధించాలని ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఈ ప్రణాళిక 2025 ఏప్రిల్ లో 22,919 కోట్ల రూపాయలతో ప్రారంభించిన ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పథకం (ECMS)కు కొనసాగింపుగా నిర్మల సీతారామన్ అభివర్ణించారు. ఈ పథకం లక్ష్యానికి రెట్టింపు పెట్టుబడిని సాధించాలని భావిస్తోన్నామని, సెమీకండక్టర్ రంగంలో ప్రపంచ దిగ్గజాలను అధిగమించేలా, దేశ ఎలక్ట్రానిక్స్ సప్లై చైన్ ను మరింత ప్రోత్సహించేలా బడ్జెట్ నిధుల కేటాయింపును 40,000 కోట్ల రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపారు.

దీని ద్వారా ఈ రంగం మరింత పురోగమిస్తుందని, ఉద్యోగ- ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుతుందని, హై-వేల్యూ గల ఎలక్ట్రానిక్స్, చిప్ ఉత్పత్తి సాధ్యమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. దీనికితోడు ఉత్పాదకతను పెంచడానికి అవసరమైన క్యాపిటల్ గూడ్స్ పై కూడా కేంద్రం దృష్టి పెడుతుందని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రెండు ప్రదేశాలలో హైటెక్ టూల్ రూమ్‌లను ఏర్పాటు చేయనున్నాయి. ఇవి డిజిటల్‌, ఆటోమేటెడ్ సేవా కేంద్రాలుగా పని చేస్తాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • biogas
  • Budget 2026 - 27
  • Duty cuts for batteries
  • FM Sitharaman
  • Solar
  • Union Budget 2026

Related News

Budget 2026 27

Budget 2026 -27 : పసలేని 2026 -27 బడ్జెట్ ! ఆశలపై నీళ్లు చల్లిన నిర్మలా

దాదాపు రూ. 53.5 లక్షల కోట్ల భారీ వ్యయంతో కూడిన 2026-27 వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. 'వికసిత్ భారత్' దిశగా అడుగులు వేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, సామాన్యులు ఆశించిన స్థాయిలో ఆదాయపు పన్నులో మార్పులు లేకపోవడం

  • Budget Brings Good News To

    Budget 2026 – 27 : పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ తెలిపిన బడ్జెట్

  • Budget Telugu States

    Budget 2026 – 27 : తెలుగు రాష్ట్రాలకు శుభవార్త తెలిపిన బడ్జెట్

  • Union Budget 2026

    ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.. 7.2 శాతం వృద్ధి హైలెట్స్ ఇవే

  • Budget 2026

    వాహనదారులకు గుడ్ న్యూస్.. బడ్జెట్ లో కార్ల ధరలు తగ్గింపు..!

Latest News

  • Megastar Chiranjeevi : మెగా వారసుడొచ్చాడంటూ చిరంజీవి సంతోషం

  • Budget 2026 -27 : చైనాకు బిగ్ షాక్ ఇచ్చిన బడ్జెట్ !!

  • Phone Tapping Case : నందినగర్ కు బయల్దేరిన కేసీఆర్‌

  • Budget 2026 : గుడ్ న్యూస్ ! హైదరాబాద్ కు 3 హైస్పీడ్ రైళ్లు – నిర్మలా సీతారామన్ ప్రకటన

  • కుప్పకూలుతున్న బంగారం , వెండి ధరలు

Trending News

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd