Tamannaah : తమన్నాకు ఆ ఇద్దరు హీరోయిన్స్ అంటే ఇష్టం అంట.. ముఖ్యంగా వాళ్ళ డ్యాన్స్.. ఎవరో తెలుసా?
తమన్నా అంటే స్పెషల్ సాంగ్స్ కి, డ్యాన్స్ లకు బాగా ఫేమస్.
- Author : News Desk
Date : 16-04-2025 - 9:48 IST
Published By : Hashtagu Telugu Desk
Tamannaah : మనకే కాదు మన సెలబ్రిటీలకు కూడా ఫేవరేట్ పర్సన్స్ ఉంటారు. పలు సందర్భాలలో వాళ్ళు తమ ఫేవరేట్ హీరోలు, హీరోయిన్స్, పర్సన్స్ గురించి చెప్తారు. తాజాగా తమన్నా ఓ ఇద్దరి హీరోయిన్స్ గురించి తెలిపింది. తమన్నా మెయిన్ లీడ్ లో తెరకెక్కిన ఓదెల 2 సినిమా ఏప్రిల్ 17 రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తమన్నా వరుస ఇంటర్వ్యూలు ఇస్తుంది.
తమన్నా అంటే స్పెషల్ సాంగ్స్ కి, డ్యాన్స్ లకు బాగా ఫేమస్. దీంతో ఓ ఇంటర్వ్యూలో మీరు బాగా డ్యాన్స్ వేస్తారు కదా, మీకు ఏ హీరోయిన్ డ్యాన్స్ లు అంటే ఇష్టం అని అడిగారు.
తమన్నా సమాధానమిస్తూ.. శ్రీలీల డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. చాలా బాగా చేస్తుంది. తనని ఇప్పటిదాకా కలవలేదు. ఫ్యూచర్ లో కలుస్తానేమో అని చెప్పింది. అలాగే.. సాయి పల్లవి అంటే ఇష్టం. తన పర్ఫరామెన్స్, డ్యాన్స్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. తను చాలా సింపుల్ గా ఉంటుంది. అందరిలో ప్రత్యేకంగా ఉంటుంది, తన డ్యాన్స్ కూడా బాగుంటుంది అని చెప్పింది. అలా తమన్నాకు శ్రీలీల, సాయి పల్లవి డ్యాన్స్ లు అంటే ఇష్టం అని చెప్పింది.
Also Read : Puri Jagannadh : బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలతో సినిమాలు లైన్లో పెడుతున్న పూరి.. గ్రాండ్ కంబ్యాక్ ఇస్తారా?