Puri Jagannadh : బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలతో సినిమాలు లైన్లో పెడుతున్న పూరి.. గ్రాండ్ కంబ్యాక్ ఇస్తారా?
పూరి వరుస ఫ్లాప్స్ చూసి టాలీవుడ్ లో ఏ హీరో ఛాన్స్ ఇవ్వట్లేదని టాక్ నడించింది.
- By News Desk Published Date - 09:28 AM, Wed - 16 April 25

Puri Jagannadh : ఇప్పటి స్టార్ హీరోలను మాస్ హీరోలుగా మార్చింది పూరి జగన్నాధ్. ఒకప్పుడు సూపర్ హిట్స్ ఇచ్చిన పూరి గత కొంతకాలంగా వరుసగా ఫ్లాప్స్ చూస్తున్నారు. దీంతో కొంతమంది పూరి పని అయిపొయింది అంటున్నారు. పూరి సినిమాలు ఆపేస్తే బెటర్ అని కూడా విమర్శలు చేసారు. కానీ పూరి ప్రయత్నాలు మానట్లేదు.
పూరి వరుస ఫ్లాప్స్ చూసి టాలీవుడ్ లో ఏ హీరో ఛాన్స్ ఇవ్వట్లేదని టాక్ నడించింది. దానికి తగ్గట్టు ఇటీవల పూరి జగన్నాధ్ తమిళ్ స్టార్ విజయ్ సేతుపతితో అధికారికంగా సినిమా అనౌన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ సినిమాలో టబు హీరోయిన్ అని కూడా అనౌన్స్ చేసారు. అసలు విజయ్ సేతుపతి లాంటి ఫామ్ లో ఉన్న స్టార్ ని పూరి ఎలా ఒప్పించాడు అని అంతా ఆశ్చర్యపోతూనే ఈ కాంబో సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
అయితే తాజాగా పూరి మరో హీరోతో కూడా సినిమా ఓకే చేసాడని వార్తలు వస్తున్నాయి. మలయాళం స్టార్ ఫహద్ ఫాజిల్ పూరి జగన్నాధ్ సినిమా ఓకే చేసాడని టాలీవుడ్ లో టాక్. ఆల్రెడీ పూరి కథ చెప్పడంతో కథ నచ్చి ఫాజిల్ ఓకే చెప్పాడని అంటున్నారు. విజయ్ సేతుపతితో సినిమా తర్వాత ఫాజిల్ తో పూరి సినిమా ఉంటుందని సమాచారం.
విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్.. ఇద్దరూ స్టార్ యాక్టర్స్. వాళ్ళ స్క్రిప్ట్స్ సెలక్షన్, యాక్టింగ్ కి దేశమంతా ఫ్యాన్స్ ఉన్నారు. ఇద్దరూ హీరోగా, విలన్ గా ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అలాంటి ఇద్దరికి కథలు చెప్పి ఓకే చేయించాడంటే పూరి గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడని అంతా భావిస్తున్నారు.
Also Read : Ram Charan : సందీప్ రెడ్డి – రామ్ చరణ్ లను కలిపిన చరణ్ ఫ్రెండ్.. బన్నీ సినిమా ఇంకా లేట్..