IT Rides : ఐటీ సోదాలపై దిల్ రాజు రియాక్షన్..
IT Rides : 'సోదాలు నా ఒక్కడిపైనే జరగడం లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం జరుగుతున్నాయి'
- By Sudheer Published Date - 05:30 PM, Wed - 22 January 25

హైదరాబాద్ లోని తన ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడులు జరగడంపై నిర్మాత దిల్ రాజు స్పందించారు. ‘సోదాలు నా ఒక్కడిపైనే జరగడం లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం జరుగుతున్నాయి’ అని అన్నారు. ‘సంక్రాంతి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) కు ఐటీ అధికారులు (IT officers) షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిన్న మంగళవారం ఉదయం నుండి దిల్ రాజు ఇంట్లో , ఆఫీస్ లలో , ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు చేయడం మొదలుపెట్టారు. విచారణలో భాగంగా ఆయన భార్య తేజస్వినిని సైతం అధికారులు బ్యాంకుకు తీసుకెళ్లారు. దిల్ రాజు తో పాటు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల ఇళ్లపై కూడా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి.
BRS Diksha Divas : బిఆర్ఎస్ కు బిగ్ రిలీఫ్
ఈరోజు పుష్ప డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar)ఇంట్లో కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. పుష్ప-2 (Pushpa 2)సినిమా భారీ కలెక్షన్ల నేపథ్యంలో మేకర్స్ ఇళ్లపై నిన్నటి నుంచి రైడ్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ చిత్ర డైరెక్టర్ సుకుమార్ ఇంట్లోనూ విస్తృతంగా తనిఖీలు చేసారు. ఇలా రెండు రోజులుగా చిత్రసీమలో ప్రముఖులపై రైడ్స్ జరుగుతుండడం ఆందోళన కలిస్తుంది. అయితే ఈ రైడ్స్ పై దిల్ రాజు స్పందించారు. ‘సోదాలు నా ఒక్కడిపైనే జరగడం లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం జరుగుతున్నాయి’ అని అన్నారు.