Sushant Rajput: మిస్టరీగా సుశాంత్‌సింగ్ మరణం.. సీబీఐ కేసులు క్లోజ్
దీనిపై ముంబై కోర్టు, సుశాంత్(Sushant Rajput) కుటుంబ సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
- By Pasha Published Date - 10:13 AM, Sun - 23 March 25

Sushant Rajput: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2020 జూన్ 14న అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఆయన మరణంలో ఎలాంటి కుట్ర కోణం లేదని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తేల్చింది. సుశాంత్ మరణంపై దర్యాప్తు క్రమంలో నమోదు చేసిన రెండు కేసులను మూసేసింది. సుశాంత్ మరణంతో నటి రియా చక్రవర్తికి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేసుల క్లోజర్ రిపోర్టును ముంబై కోర్టులో సీబీఐ దాఖలు చేసింది. దీనిపై ముంబై కోర్టు, సుశాంత్(Sushant Rajput) కుటుంబ సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. మొత్తం మీద ఐదేళ్ల సుదీర్ఘ దర్యాప్తు తర్వాత సీబీఐ ఇచ్చిన ఈ నివేదిక సంచలనం క్రియేట్ చేసింది.సుశాంత్ మరణంపై మరోసారి చర్చకు బీజాలు వేసింది.
Also Read :Amaravati Update : తిరుమలను తలపించేలా అమరావతిలో శ్రీవారి ఆలయం
సీబీఐ నివేదికలో ఏముంది ?
- సుశాంత్ మరణంలో కుట్ర కోణం లేదు.
- సుశాంత్ మరణంలో కుట్ర ఉన్నట్లు ఆధారాలు లేవు.
- సుశాంత్ మరణంతో నటి రియా చక్రవర్తికి సంబంధం లేదు. రియాకు క్లీన్ చిట్.
- సుశాంత్ కుటుంబ సభ్యులపై రియా చక్రవర్తి దాఖలు చేసిన కేసును సీబీఐ క్లోజ్ చేసింది.
Also Read :Mass Shooting : కారు కోసం కాల్పుల మోత.. ముగ్గురి మృతి, 15 మందికి గాయాలు
సుశాంత్ మరణం..ఆ తర్వాత..
- 2020 జూన్ 14న ముంబైలోని బాంద్రాలో ఉన్న తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో నటుడు సుశాంత్ సింగ్ మృతిచెందారు.
- సుశాంత్ మరణం వెనక కుట్ర కోణం ఉందనే ఆరోపణలు వచ్చాయి.
- నటి రియా చక్రవర్తి, మరి కొంతమందిపై సుశాంత్ కుటుంబీకులు ఆరోపణలు చేశారు.
- ‘‘సుశాంత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించారు. ఆర్థికంగా సుశాంత్‌ను మోసం చేయడంతో పాటు మానసిక వేధింపులకు గురి చేశారు’’ అని ఆయన తండ్రి కేకే సింగ్ ఆరోపించారు. ఈమేరకు పాట్నాలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నటి రియా చక్రవర్తితో పాటు పలువురిపై కేసు నమోదైంది.
- దీనికి కౌంటర్‌గా సుశాంత్ సింగ్ సోదరీమణులపై నటి రియా చక్రవర్తి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్లు నకిలీ మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం వల్లే సుశాంత్ మరణించాడని ఫిర్యాదులో రియా ఆరోపించారు.
- సుశాంత్ సింగ్ మరణం కేసు సంచలనం సృష్టించడంతో.. నాటి మహారాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీబీఐకి అప్పగించింది.