Bigg Boss Shivaji : బిగ్ బాస్ చాణక్య విలన్ గా రెడీనా.. ఆ డైరెక్టర్ హామీ ఇచ్చాడట..!
Bigg Boss Shivaji బిగ్ బాస్ సీజన్ 7 లో తన మార్క్ చూపించి చాణక్యగా పేరు తెచ్చుకున్నాడు నటుడు శివాజీ. దాదాపు రెండు దశాబ్ధాలుగా సినీ పరిశ్రమలో ఉంటూ వచ్చిన ఆయన 90కి పైగా
- Author : Ramesh
Date : 27-01-2024 - 10:43 IST
Published By : Hashtagu Telugu Desk
Bigg Boss Shivaji బిగ్ బాస్ సీజన్ 7 లో తన మార్క్ చూపించి చాణక్యగా పేరు తెచ్చుకున్నాడు నటుడు శివాజీ. దాదాపు రెండు దశాబ్ధాలుగా సినీ పరిశ్రమలో ఉంటూ వచ్చిన ఆయన 90కి పైగా సినిమాల్లో నటించారు. అటు బిగ్ బాస్ నుంచి రావడమే ఆలస్యం #90s వెబ్ సీరీస్ తో మెప్పించారు.
We’re now on WhatsApp : Click to Join
ఈ వెబ్ సీరీస్ వల్ల చాలా కాలం తర్వాత సక్సెస్ అందుకున్నారు శివాజి. ఐతే ఇదంతా కూడా బిగ్ బాస్ వల్లే అని అంటున్నారు. బిగ్ బాస్ కి వెళ్లడం వల్ల తనకి చాలా పాపులారిటీ వచ్చిందని. ఇప్పుడు మళ్లీ కెరీర్ కొత్తగా మొదలు పెట్టినట్టు ఉందని అన్నారు శివాజి.
ఇక ఇదిలాఉంటే సినిమాల్లో హీరోగా రాణించిన ఆయన ఇప్పుడు సోలో సినిమాలు చేయాలని అనుకుంటున్నా ఆ అవకాశాలు వచ్చినా రాకపోయినా సినిమాల్లో ఎలాంటి పాత్ర ఇచ్చినా చేస్తానని అంటున్నారు. ముఖ్యంగా హీరోగా చేసిన ఆయన విలన్ గా కూడా చేస్తానని చెబుతున్నారు. విలన్ గా తాను చేసేందుకు రెడీ.. సరైన కథ.. స్టార్ హీరో సినిమాలకు ప్రతి నాయకుడిగా తాను రెడీ అంటున్నారు శివాజి.
అంతేకాదు తనని విలన్ గా పెట్టుకోవాలని డైరెక్టర్ బోయపాటి శ్రీను దగ్గర హామీ కూడా తీసుకున్నారట. ఒకప్పటి హీరోలను విలన్ గా మార్చడం.. వారికి సరికొత్త లైఫ్ ఇవ్వడంలో బోయపాటి స్టైలే వేరు. లెజెండ్ నుంచి జగపతి బాబు ఫాం తెలిసిందే. అలానే శివాజిని కూడా విలన్ గా చూపించాలని అనుకుంటున్నారట. మరి అది ఏ సినిమా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఇదివరకు కంటే బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక తన కెరీర్ బాగుందని అంటున్నారు శివాజి.