Prashanth Varma Comments on Prabhas Adipurush : ప్రభాస్ ఆదిపురుష్ నచ్చలేదు.. హనుమాన్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..! 9:45
Prashanth Varma Comments on Prabhas Adipurush హనుమాన్ తో సూపర్ హిట్ కొట్టి మరోసారి తన డైరెక్షన్ టాలెంట్ చూపించిన ప్రశాంత్ వర్మ హనుమాన్ రిలీజ్ తర్వాత వరుస ఇంటర్వ్యూస్
- Author : Ramesh
Date : 27-01-2024 - 9:58 IST
Published By : Hashtagu Telugu Desk
Prashanth Varma Comments on Prabhas Adipurush హనుమాన్ తో సూపర్ హిట్ కొట్టి మరోసారి తన డైరెక్షన్ టాలెంట్ చూపించిన ప్రశాంత్ వర్మ హనుమాన్ రిలీజ్ తర్వాత వరుస ఇంటర్వ్యూస్ ఇస్తూ వచ్చాడు. రిలీజ్ ముందు సినిమా గురించి చెబితే ఎవరు పట్టించుకోరనో లేకా రిలీజ్ తర్వాత ఎలాగు సినిమా హిట్ అవుతుందన్న నమ్మకమో కానీ ఆఫ్టర్ రిలీజ్ ప్రశాంత్ వర్మ వరుసగా ఇంటర్వ్యూస్ చేస్తున్నాడు. హనుమాన్ రెండో వారంలో కూడా వసూళ్లు అదరగొట్టడం తో సూపర్ హ్యాపీగా ఉన్నాడు.
We’re now on WhatsApp : Click to Join
ఇక లేటెస్ట్ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ ప్రభాస్ ఆదిపురుష్ సినిమా మీద కామెంట్ చేశాడు. ఆదిపురుష్ సినిమాపై తన అభిప్రాయం చెబుతూ సినిమా చూశాను అందులో కొన్ని సీన్స్ నచ్చాయి.. కానీ ఇంకొన్ని సీన్స్ తెరకెక్కించిన విధానం నచ్చలేదని చెప్పాడు ప్రశాంత్ వర్మ. తను ఆదిపురుష్ తీసి ఉంటే కచ్చితంగా అంతకంటే బాగా తీసేవాడినని అన్నాడు.
ఆదిపురుష్ సినిమా చూశాక తనకే కాదు ఏ ఫిల్మ్ మేకర్ కి అయినా అలాంటి ఫీలింగే కలుగుతుందని అన్నరు ప్రశాంత్ వర్మ. ఆదిపురుష్ సినిమా ఫలితం తన మీద ఎలాంటి ప్రభావం చూపించలేదని అన్నారు. కేవలం టీం సపోర్ట్ తోనే ఈ సినిమా అనుకున్న విధంగా తీయగలిగానని అన్నారు ప్రశాంత్ వర్మ.