Allu Arjun : అట్లీ బోయపాటి మధ్య త్రివిక్రం..!
పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) చేసే సినిమా ఏదన్నది అల్లు ఫ్యాన్స్ లో కన్ ఫ్యూజన్ మొదలైంది. అసలైతే పుష్ప తర్వాత త్రివిక్రం (Trivikram) తో సినిమా చేస్తాడని అనుకున్నారు.
- Author : Ramesh
Date : 25-01-2024 - 11:16 IST
Published By : Hashtagu Telugu Desk
పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) చేసే సినిమా ఏదన్నది అల్లు ఫ్యాన్స్ లో కన్ ఫ్యూజన్ మొదలైంది. అసలైతే పుష్ప తర్వాత త్రివిక్రం (Trivikram) తో సినిమా చేస్తాడని అనుకున్నారు. సినిమా అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. మరోపక్క తమిళ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి.
We’re now on WhatsApp : Click to Join
షారుఖ్ తో జవాన్ చేసిన అట్లీ తన నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్ తోనే చేయాలని ఫిక్స్ అయినట్టు టాక్. ఇద్దరి మధ్య కథా చర్చలు జరిగినట్టు చెప్పుకుంటున్నారు.
ఇదిలాఉంటే అల్లు అర్జున్ తో బోయపాటి శ్రీను (Boyapati Srinu) సినిమా కూడా ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. స్కంద లాంటి ఫ్లాప్ పడినా తనకు సరైనోడు లాంటి హిట్ ఇచ్చాడని బోయపాటితో అల్లు అర్జున్ సినిమాకు ఓకే అనేశాడట. బోయపాటి శ్రీను కూడా బన్నీ సినిమా చేశాకే బాలకృష్ణ తో అఖండ 2 (Akhanda 2) చేయాలని అనుకుంటున్నాడు.
లైన్ లో ముగ్గురు దర్శకులు ఉండగా అల్లు అర్జున్ ఓటు ఎవరికి అన్నది తెలియాల్సి ఉంది. త్రివిక్రం గుంటూరు కారం తర్వాత ఫ్రీగా ఉన్నాడు. అట్లీ (Atlee) కూడా జవాన్ తర్వాత మరో సినిమా అనౌన్స్ చేయలేదు. వీరిద్దరు బన్నీతోనే చేయాలని చూస్తున్నారు. బోయపాటి మాత్రం అల్లు అర్జున్ సినిమా లేకపోయినా బాలయ్యతో అఖండ 2 చేసే ఛాన్స్ ఉంది. మరి ఈ కన్ ఫ్యూజన్ ఎప్పుడు క్లియర్ అవుతుందో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఎవరితో అవుతుందో చూడాలి.