Netflix Worldwide Subscribers Record : వరల్డ్ వైడ్ గా నెట్ ఫ్లిక్స్ కి ఉన్న సబ్ స్క్రైబర్స్ ఎంతమందో తెలుసా.. వేరే ఏ ఓటీటీ టచ్ చేయలేదు..!
Netflix Worldwide Subscribers Record డిజిటల్ స్ట్రీమింగ్ లో రారాజుగా తన సత్తా చాటుతుంది నెట్ ఫ్లిక్స్. ఒకానొక దశలో హాలీవుడ్ మార్కెట్ ని కొల్లగొట్టినట్టు కనిపించిన నెట్ ఫ్లిక్స్
- Author : Ramesh
Date : 25-01-2024 - 10:50 IST
Published By : Hashtagu Telugu Desk
Netflix Worldwide Subscribers Record డిజిటల్ స్ట్రీమింగ్ లో రారాజుగా తన సత్తా చాటుతుంది నెట్ ఫ్లిక్స్. ఒకానొక దశలో హాలీవుడ్ మార్కెట్ ని కొల్లగొట్టినట్టు కనిపించిన నెట్ ఫ్లిక్స్ ఇప్పటికీ అదే హవా కొనసాగిస్తుంది. ఈ క్రమంలో నెట్ ఫ్లిక్స్ వరల్డ్ వైడ్ సబ్ స్క్రైబర్స్ గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది. వరల్డ్ వైడ్ గా ఉన్న నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రైబర్స్ ఎంతమందో తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా నెట్ ఫ్లిక్స్ ని మొత్తం 260 మిలియన్ సబ్ స్క్రైబర్స్ ఉన్నట్టు నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది.
We’re now on WhatsApp : Click to Join
2023 మొదట్లో 240 సబ్ స్క్రైబర్స్ ఉన్నట్టు ప్రకటించిన నెట్ ఫ్లిక్స్ లాస్ట్ ఇయర్ మరో 20 మిలియన్ సబ్ స్క్రైబర్స్ ని తన ఖాతాలో చేర్చుకుంది. లాస్ట్ 3 నెలల్లోనే 13 మిలియన్ కొత్త సబ్ స్క్రైబర్స్ చేరినట్టు తెలుస్తుంది. ఓటీటీలన్నిటిలీ సబ్ స్క్రైబ్ అమౌంట్ నెట్ ఫ్లిక్స్ కే ఎక్కువ ఉంటుంది. కానీ దీనికే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ సబ్ స్క్రైబర్స్ ఉన్నారు.
ఈమధ్య నెట్ ఫ్లిక్స్ C.E.O తెలుగు స్టార్స్ అందరినీ కలిసి స్పెషల్ మీటింగ్ ఏర్పరచుకున్నాడు. రాబోయే భారీ సినిమాలన్నీ కూడా నెట్ ఫ్లిక్స్ లోనే రిలీజ్ కాబోతున్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం 260 మిలియన్స్ సబ్ స్క్రైబర్స్ ఉన్న నెట్ ఫ్లిక్స్ లో నెక్స్ట్ ఇయర్ మరింత మంది కొత్త ఖాతాదారులు వచ్చే అవకాశం ఉంది. పోటీగ అమేజాన్ ప్రైం ఎంత ట్రై చేస్తున్నా నెట్ ఫ్లిక్స్ రేంజ్ కి చేరుకోలేకపోతుంది.
Also Read : Mahesh Babu: ఇండస్ట్రీలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న మహేశ్ బాబు, సెలబ్రేషన్స్ లో ఫ్యాన్స్