RC16 : రామ్ చరణ్ చిత్రానికి ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్…
- Author : Sudheer
Date : 06-01-2024 - 3:55 IST
Published By : Hashtagu Telugu Desk
ఆర్ఆర్ఆర్ (RRR) మూవీ తో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ (Ram CHaran)..ప్రస్తుతం వరుస గా పాన్ ఇండియా మూవీస్ తో అలరించేందుకు సిద్ధం అయ్యాడు. శంకర్ డైరెక్షన్లో ప్రస్తుతం దిల్ రాజు ప్రొడక్షన్లో గేమ్ చెంజర్ (Game Changer) మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తి కావొస్తుంది. ఈ క్రమంలో తన నెక్స్ట్ సినిమాకు సంబదించిన క్రేజీ అప్డేట్ ఇచ్చి అభిమానుల్లో ఉత్సాహాం నింపారు.
We’re now on WhatsApp. Click to Join.
ఉప్పెన చిత్రంతో మెగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బుచ్చిబాబు (Buchhibabu)..రామ్ చరణ్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటీకే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టిన మేకర్స్..మ్యూజిక్ డైరెక్టర్ గా ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ (AR Rahman) ను ఎంపిక చేసారు. ఈరోజు రెహమాన్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ప్రత్యేక పోస్టర్ ను రిలీజ్ చేసి ఈ విషయాన్నీ ప్రకటించారు. వాస్తవానికి కొద్దీ నెలల క్రితమే తెలుగు మీడియాతో ముచ్చటిస్తూ రెహమాన్ చరణ్ సినిమాకు మ్యూజిక్ చేయబోతున్నట్లు తెలిపారు. కానీ అది ఏ సినిమా తెలియక చాలామంది అయోమయంలో పడ్డారు. కానీ ఇప్పుడు RC16 అని తెలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై కిలారు వెంకట సతీష్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుంచి ఫ్రీ అవ్వగానే RC 16 రెగ్యులర్ షూటింగ్ జరిపే అవకాశాలు ఉన్నాయి.
రెహమాన్ ఎన్నో తెలుగు సినిమాలకు మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. ‘ఏ మాయ చేసావె’ , నాని , కొమరం పులి వంటి ఈ మధ్య కాలంలో మ్యూజిక్ అందించిన చిత్రాలు. చాల గ్యాప్ తర్వాత తెలుగు స్ట్రయిట్ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండడం తో అంచనాలు భారీగా ఉండనున్నాయి.
Read Also : Viral Video : న్యూజిలాండ్ పార్లమెంట్ ను దడ దడలాడించిన 21 ఏళ్ల మహిళ ఎంపీ