Allu Arjun : అల్లు అర్జున్ కి గురూజీ హ్యాండ్ ఇచ్చాడా..?
Allu Arjun పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేసే సినిమాల మీద అల్లు ఫ్యాన్స్ లో కన్ ఫ్యూజన్ మొదలైంది. సుకుమార్ తో పుష్ప చేసే టైం లో ముందు ఒక సినిమాగానే
- By Ramesh Published Date - 11:45 PM, Fri - 21 June 24

Allu Arjun పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేసే సినిమాల మీద అల్లు ఫ్యాన్స్ లో కన్ ఫ్యూజన్ మొదలైంది. సుకుమార్ తో పుష్ప చేసే టైం లో ముందు ఒక సినిమాగానే రిలీజ్ చేయాలని అనుకోగా అది కాస్త రెండు భాగాలుగా వస్తుంది. పుష్ప 1 సూపర్ హిట్ అవ్వడంతో పుష్ప 2 మీద విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఇక పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఆమధ్య త్రివిక్రం తో సినిమా చేయాలని అనుకున్నాడు. సినిమా ప్రకటన కూడా వచ్చేసింది. కానీ మధ్యలో అట్లీ వచ్చే సరికి ప్లాన్ మార్చుకోవాలని అనుకున్నాడు.
మరోపక్క సందీప్ వంగతో కూడా సినిమా చేయాలని అనుకున్నాడు అల్లు అర్జున్. ఈ ముగ్గురిలో ముందు అట్లీ ఆ తర్వాత త్రివిక్రం తో సినిమా అనుకోగా అట్లీ సినిమా రెమ్యునరేషన్స్ వల్ల ఆగిపోయింది. అల్లు అర్జున్ ని కాదని సల్మాన్ ఖాన్ తో అట్లీ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇక గురూజీ తో అయినా కుదురుతుందేమో అనుకుంటే ఆయన కూడా ఇప్పుడప్పుడే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయాలని అనుకోవట్లేదని తెలుస్తుంది.
గుంటూరు కారం సినిమాతో తనపై వచ్చిన విమర్శలను సీరియస్ గా తీసుకున్న త్రివిక్రం కాస్త టైం తీసుకుని మళ్లీ తన మార్క్ చూపించే సినిమాతో రావాలని ఫిక్స్ అయ్యారు. అందుకే అల్లు అర్జున్ రెడీ అయినా తాను రెడీ లేనని వేరే డైరెక్టర్ ని చూసుకోమని చెప్పాడని టాక్. ఐతే సందీప్ వంగ కూడా ప్రభాస్ తో స్పిరిట్ చేసిన తర్వాతనే అల్లు అర్జున్ తో సినిమా చేసే అవకాశం ఉంటుంది. మరి అల్లు అర్జున్ నెక్స్ట్ ఎవరితో చేస్తాడన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ కొనసాగుతుందని చెప్పొచ్చు.