Allu Arjun Pushpa 2 Kerala Rights : పుష్ప 2 అక్కడ రికార్డులు బ్రేక్ చేస్తుందా..?
Allu Arjun Pushpa 2 Kerala Rights సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా పుష్ప ది రైజ్. 2021 చివర్లో వచ్చి సంచలన విజయం అందుకున్న ఈ సినిమా సీక్వల్ పుష్ప 2 కోసం
- Author : Ramesh
Date : 09-05-2024 - 2:20 IST
Published By : Hashtagu Telugu Desk
Allu Arjun Pushpa 2 Kerala Rights సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా పుష్ప ది రైజ్. 2021 చివర్లో వచ్చి సంచలన విజయం అందుకున్న ఈ సినిమా సీక్వల్ పుష్ప 2 కోసం ఆడియన్స్ అంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పుష్ప 2 ని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తెరకెక్కిస్తున్నారు. పుష్ప 2 సినిమాను ఆగష్టు 15న రిలీజ్ లాక్ చేశారు.
పాన్ ఇండియా లెవెల్ లో భారీగా రిలీజ్ కాబోతున్న పుష్ప 2 సినిమా అన్నిచోట్ల అదే రేంజ్ లో బిజినెస్ జరుగుతుంది. ఈ క్రమంలో కేరళలో పుష్ప 2 కోసం రికార్డ్ ప్రైజ్ పెట్టేస్తున్నారట. అక్కడ బడా డిస్ట్రిబ్యూటర్స్ అయిన E4 ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ మొత్తం ఖర్చు పెట్టి పుష్ప 2 రిలీజ్ రైట్స్ కొనేశారట.
E4 ఎంటర్టైన్మెంట్స్ అంటే కేరళలో ఒక పేరున్న డిస్ట్రిబ్యూషన్ సంస్థ. పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్టైన సినిమాలన్నీ కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ ద్వారానే కేరళలో రిలీజ్ చేయబడ్డాయి. పుష్ప 2 తో పాటుగా విక్రం తంగలాన్, సూర్య కంగువ సినిమాలు కూడా E4 ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేస్తుంది.
అసలే మలయాళంలో అల్లు అర్జున్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. అక్కడ స్టార్స్ కు ఈక్వల్ గా అల్లు అర్జున్ ని అభిమానిస్తారు ఫ్యాన్స్. అందుకే పుష్ప 2 ను అక్కడ స్ట్రైట్ సినిమాలానే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. పుష్ప 2 రికార్డుల్లో కేరళ కలెక్షన్స్ కూడా స్పెషల్ రోల్ పోశిస్తాయని చెప్పొచ్చు.
Also Read : Devara : అక్టోబర్ కాదు సెప్టెంబర్‌లోనే రాబోతున్న దేవర.. నిజమేనా..?