Pushpa 2 First Day Target : పుష్ప 2 ఫస్ట్ డే టార్గెట్ ఎంత..?
Pushpa 2 First Day Target సినిమా క్రేజ్ చూస్తుంటే కచ్చితంగా భారీగా ఫస్ట్ డే వసూళ్లు రాబట్టేలా ఉంది. పుష్ప 2 సినిమా విషయంలో ప్రతిదీ కూడా ఫ్యాన్స్ కు ఫుల్ ఫీస్ట్ లా అనిపించింది. తప్పకుండా సినిమా నెక్స్ట్ లెవెల్
- By Ramesh Published Date - 02:04 PM, Mon - 2 December 24

Pushpa 2 First Day Target 3 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పుష్ప 2 సినిమా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొట్టేస్తుంది. నార్త్ బెల్ట్ లో Allu Arjun పుష్ప 2 మేనియా ఒక రేంజ్ లో ఉంది. అక్కడ టికెట్ రేటు ఎంత అన్నది కూడా పట్టించుకోకుండా సినిమా చూసేందుకు ముందుకొస్తున్నారు. మన దగ్గర కాస్త రేటు ఎక్కువైందన్న వార్తలు వచ్చినా అవేవి సినిమా మీద అంత ఎఫెక్ట్ చూపించేలా కనిపించడం లేదు. పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ బజ్ ఒక రేంజ్ లో ఉంది.
సినిమా క్రేజ్ చూస్తుంటే కచ్చితంగా భారీగా ఫస్ట్ డే వసూళ్లు రాబట్టేలా ఉంది. పుష్ప 2 (Pushpa 2) సినిమా విషయంలో ప్రతిదీ కూడా ఫ్యాన్స్ కు ఫుల్ ఫీస్ట్ లా అనిపించింది. తప్పకుండా సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని ఫిక్స్ అయ్యారు. ఐతే పుష్ప 2 ఫస్ట్ డే టార్గెట్ ఎంత అన్నది చర్చ నడుస్తుంది.
పుష్ప రాజ్ మాస్ మేనియా..
సినిమా ఫస్ట్ డే 200 కోట్ల దాకా రాబట్టే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు. ఫస్ట్ డే 100 కోట్లే చాలా పెద్ద ఫిగర్ అలాంటిద్ 200 కోట్లు (200 Crores) అంటే అది మామూలు రికార్డ్ కాదు. పుష్ప రాజ్ మాస్ మేనియా కు ఇది సాధ్యమే అనేలా ఉంది. ఇక నేడు పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగుతుంది.
ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని ఉద్దేశించి ఏం మాట్లాడతాడు అన్నది ఆసక్తికరంగా మారింది. పుష్ప 2 సినిమా విషయంలో ఇప్పటివరకు అయితే అన్నీ బాగా జరిగాయి. మరి సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.