Raghubabu : బన్నీ 100 డేస్ ఫంక్షన్ లో నన్ను ఎవరూ పట్టించుకోలేదు.. కానీ చిరంజీవి పిలిచి మాట్లాడటంతో..
సీనియర్ నటుడు రఘుబాబు బ్రహ్మ ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ బన్నీ సినిమా 100 రోజుల వేడుకలో జరిగిన సంఘటనను పంచుకున్నారు.
- By News Desk Published Date - 09:51 AM, Thu - 13 February 25

Raghubabu : అల్లు అర్జున్ మూడో సినిమా బన్నీ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయి 100 రోజులు కూడా ఆడింది. తాజాగా సీనియర్ నటుడు రఘుబాబు బ్రహ్మ ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ బన్నీ సినిమా 100 రోజుల వేడుకలో జరిగిన సంఘటనను పంచుకున్నారు. బ్రహ్మ ఆనందం సినిమా ఈవెంట్ కు చిరంజీవి గెస్ట్ గా వచ్చారు.
ఈ ఈవెంట్ లో రఘుబాబు మాట్లాడుతూ.. బన్నీ సినిమాలో నా పాత్ర ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. అందర్నీ నవ్వించాను. బన్నీ సినిమా 100 రోజుల వేడుకలో అందరూ స్టేజి పైకి ఎక్కి అందరి గురించి మాట్లాడుతున్నారు, పొగుడుతున్నారు. కానీ నా గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. చివరగా ఆ వేడుకకు గెస్ట్ గా వచ్చిన చిరంజీవి స్టేజిపైకి వచ్చి మూవీలో అందరి గురించి మాట్లాడుతున్నారు కానీ రఘుబాబు గురించి ఎవరూ మాట్లాడటలేదు ఏంటి, నీ గురించి ఎవ్వరూ చెప్పట్లేదేంటయ్యా అని నన్ను పిలిచి భుజం మీద చెయ్యి వేసి సినిమాలో చాలా బాగా చేసావు. ఈ సినిమా ఇంకోసారి చూడాలంటే దానికి కారణం నువ్వే అని అన్నారు. లైవ్ ఈవెంట్లో ఆయన నా గురించి పొగడటంతో తర్వాత నాకు సినిమా అవకాశాలు వరుసగా వచ్చాయి. ఆయన వల్లే ఇప్పటికి నేను 400 సినిమాలు చేయగలిగాను అని చెప్పారు.
దీంతో రఘుబాబు వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మెగా ఫ్యాన్స్ అదిరా చిరంజీవి అంటే, ట్యాలెంట్ ఎక్కడున్నా గుర్తిస్తారు అని బాస్ ని పోగుడుతున్నారు. బన్నీ సినిమాలో ప్రకాష్ రాజ్ దగ్గర గుడ్డి రౌడీ పాత్రలో రఘుబాబు ఫుల్ గా నవ్విస్తాడు. విలన్ గా, కమెడియన్ గా చాలా సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు రఘుబాబు.
Also Read : Prabhas Movie : ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాలో నటించాలి అనుకుంటున్నారా? ఈ ఛాన్స్ మీకోసమే..