Aadhi Pinisetty : అఖండ 2 పై షాకింగ్ ట్విస్ట్ రివిల్ చేసిన ఆది!
- By Vamsi Chowdary Korata Published Date - 10:52 AM, Sat - 22 November 25
అఖండ విజయానికి సీక్వెల్‌గా వస్తున్న అఖండ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సందర్భంలో ఆది పినిశెట్టి బాలయ్య–బోయపాటి కాంబినేషన్‌ను ఆకాశానికి ఎత్తేశారు. “వీరిద్దరి కాంబో నెక్స్ట్ లెవెల్… నేల టిక్కెట్‌లో చూసేవాళ్లు చివరికి బాల్కనీలో ఉంటారు” అంటూ ఆది చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అతను గతంలో బోయపాటి సరైనోడులో విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా విడుదలైన అఖండ 2 ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది .
బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ పవర్‌ఫుల్ మాస్ యాక్షన్‌తో వచ్చిన ‘అఖండ’ భారీ విజయాన్ని సాధించి బాలయ్య కెరీర్‌లో కొత్త మైలురాయిగా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా అదే కాంబినేషన్‌లో వస్తున్న ‘ అఖండ 2 ’పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. శుక్రవారం రాత్రి విడుదల చేసిన ట్రైలర్లో బాలయ్య విశ్వరూపం చూపించాడు. ‘దేశం జోలికొస్తే మీరు దండిస్తారు, ధర్మం జోలికొస్తే మేం ఖండిస్తాం… మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రయిక్స్…’’ ‘‘ఇప్పటివరకూ ప్రపంచపటంలో మా దేశం రూపాన్నే చూసి ఉంటావు, ఎప్పుడూ మా దేశం విశ్వరూపాన్ని చూసి ఉండవ్, మేం ఒక్కసారి లేచి శబ్దం చేస్తే ఈ ప్రపంచం మొత్తం నిశ్శబ్దం’ అంటూ బాలయ్య చెప్పిన డైలాగులు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి.
ఈ మూవీలో ప్రముఖ దర్శకుడు రవి రాజా పినిశెట్టి కుమారుడు ఆది పినిశెట్టి నటుడిగా విలన్‌గా నటిస్తున్నాడు. ‘సరైనోడు’లో విలన్‌గా చేసిన పాత్రతో అతనికి బోయపాటి శ్రీనుతో మంచి బాండింగ్ ఏర్పడింది. ఇప్పుడు అఖండ 2 ప్రమోషన్స్‌లో భాగంగా ఆది పినిశెట్టి ఈ కాంబినేషన్‌ను ఆకాశానికి ఎత్తేశారు. అఖండ 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆది పినిశెట్టి, బాలయ్య–బోయపాటి కాంబినేషన్ గురించి భారీ ఎలివేషన్ ఇచ్చారు. “వీరిద్దరి కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్. ఈ సినిమా నేల టిక్కెట్‌లో చూసే ఆడియన్స్ కూడా సినిమా అయ్యేసరికి బాల్కనీలో ఉంటారు” అని చెప్పి అందరి దృష్టిని ఆకర్షించారు.

సినిమా ఇచ్చే ఎనర్జీ, ఎమోషన్, హై-వోల్టేజ్ స్క్రీన్ ప్రెజెన్స్ కారణంగా ప్రేక్షకులు గాలిలో తేలిపోతున్నంత హ్యాపీనెస్‌లో ఉంటారని ఆది చెప్పడం చూస్తుంటే సినిమా ఏ లెవెల్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ‘సరైనోడు’ సినిమా నుంచి బోయపాటితో తనకున్న ఉన్న బంధం, పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసిలో విలన్‌గా కనిపించినప్పటి అనుభవాలు అన్నీ కలిసి తన మాటల్లోని నిజాయతీ, విశ్వాసంతో ఆది అందరినీ ఆకట్టుకున్నాడు. ‘అఖండ 2’పై ఆయన ఇచ్చిన ఈ ఎలివేషన్ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రాక్షన్ తెచ్చుకుంది.
సెంబర్ 5న విడుదల కానున్న అఖండ 2 ప్రమోషన్స్ వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ రాగా శుక్రవారం విడుదల చేసిన ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేవదూత రూపంలో బాలయ్య నటన, బోయపాటి విజన్, హై యాక్షన్ మోమెంట్స్, గ్రాండ్ వీఎఫ్ఎక్స్, తమన్ బీజీఎం ట్రైలర్‌ను నెక్స్ట్ రేంజ్‌కు తీసుకెళ్లాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.