Shruthi Hassan : శృతి హాసన్ కి కలిసి వచ్చిన 2023..!
Shruthi Hassan కమల్ గారాల పట్టి శృతి హాసన్ హీరోయిన్ గా తిరిగి తన ఫాం కొనసాగిస్తుంది. అమ్మడు తెలుగులో కొన్నాళ్లు సినిమాలు
- By Ramesh Published Date - 01:18 PM, Mon - 25 December 23

Shruthi Hassan కమల్ గారాల పట్టి శృతి హాసన్ హీరోయిన్ గా తిరిగి తన ఫాం కొనసాగిస్తుంది. అమ్మడు తెలుగులో కొన్నాళ్లు సినిమాలు చేయలేదు. అయితే రీ ఎంట్రీ తర్వాత టాలీవుడ్ లో దూసుకెళ్తుంది శృతి హాసన్. 2023 లో శృతి హాసన్ కి బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఈ ఇయర్ మొదట్లోనే చిరంజీవితో వాల్తేరు వీరయ్య, బాలకృష్ణతో వీర సింహా రెడ్డి సినిమాలు చేసిన శృతి హాసన్ ఆ రెండు సినిమాలతో సూపర్ హిట్ అందుకుంది.
Also Read : Prabhas : సలార్ ఐటం సాంగ్.. షూట్ చేసి ఎందుకు కట్ చేశారు..?
ఇక నాని హాయ్ నాన్న సినిమాలో స్పెషల్ సాంగ్ తో సర్ ప్రైజ్ చేసింది శృతి హాసన్. ఈ సాంగ్ సినిమాకు ఎంత హెల్ప్ అయ్యిందో కానీ సినిమా సక్సెస్ అవడంతో శృతి హాసన్ వల్లే అనుకుంటున్నారు. ఇక లేటెస్ట్ గా వచ్చిన సలార్ సినిమాలో కూడా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. సలార్ బాక్సాఫీస్ సంచలనాలు తెలిసిందే.
ఈ ఇయర్ మొత్తం శృతి హాసన్ కి బాగా కలిసి వచ్చింది. 3 సూపర్ హిట్లతో టాలీవుడ్ లో సూపర్ ఫాం కొనసాగిస్తుంది శృతి హాసన్. ఇదే ఫాం తో తెలుగులో మరిన్ని సినిమాలు చేస్తే చూడాలని అనుకుంటున్నారు ఆమె ఫ్యాన్స్. మరోపక్క కోలీవుడ్ లో కూడా శృతి హాసన్ దూసుకెళ్తుంది.
We’re now on WhatsApp : Click to Join