Gold Price : ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..!
ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 78, 110కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 71, 160కి చేరుకుంది.
- By Latha Suma Published Date - 10:40 AM, Fri - 22 November 24

Gold Price : ఇటీవల తగ్గిన బంగారం ధరలు మళ్లీ క్రమంగా పుంజుకుంటున్నాయి. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.78,780 ఉండగా, శుక్రవారం నాటికి రూ.960 పెరిగి రూ.79,740గా ఉంది. గురువారం కిలో వెండి ధర రూ.92,850 ఉండగా శుక్రవారం నాటికి రూ.370 తగ్గి రూ.92,480గా ఉంది. ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77, 960కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 71, 140కి చేరింది. వెండి ధరలు కేజీకి నిన్నటితో పోలిస్తే వంద రూపాయలు తగ్గాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 78, 110కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 71, 160కి చేరుకుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
.హైదరాబాద్‌లో రూ. 77, 960, రూ. 71, 460
.విజయవాడలో రూ. 77, 960, రూ. 71, 460
.ఢిల్లీలో రూ. 78, 110, రూ. 71, 160
.ముంబయిలో రూ. 77, 960, రూ. 71, 460
.వడోదరలో రూ. 78, 010, రూ. 71, 150
.కోల్‌కతాలో రూ. 77, 960, రూ. 71, 460
.చెన్నైలో రూ. 77, 960, రూ. 71, 460
.బెంగళూరులో రూ. 77, 960, రూ. 71, 460
.కేరళలో రూ. 77, 960, రూ. 71, 460
.పుణెలో రూ. 77, 960, రూ. 71, 460
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
.హైదరాబాద్‌లో రూ. 1, 00, 900
.విజయవాడలో రూ. 1, 00, 900
.ఢిల్లీలో రూ. 91, 900
.చెన్నైలో రూ. 1, 00, 900
.కోల్‌కతాలో రూ. 91, 900
.కేరళలో రూ. 1, 00, 900
.ముంబయిలో రూ. 91, 900
.బెంగళూరులో రూ. 91, 900
.భువనేశ్వర్‌లో రూ. 1, 00, 900
.వడోదరలో రూ. 91, 900
.అహ్మదాబాద్‌లో రూ. 91, 900
ఇకపోతే.. పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన..
కాగా, అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగాయి. గురువారం ఔన్స్ గోల్డ్ ధర 2656 డాలర్లుగా ఉండగా, శుక్రవారం నాటికి 30 డాలర్లు పెరిగి 2686 డాలర్లగా ఉంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 30.93 డాలర్లుగా ఉంది.