Vodafone Idea : వొడాఫోన్ ఐడియాలో కేంద్రానికి 48.99 శాతం వాటా.. ప్రభుత్వ సంస్థగా మారుతుందా?
వొడాఫోన్ ఐడియా(Vodafone Idea)లోని 48.99 శాతం వాటా ప్రభుత్వం చేతికి వచ్చినా.. దానిపై నియంత్రణ మాత్రం కంపెనీ ప్రమోటర్లకే ఉంటుంది.
- By Pasha Published Date - 04:48 PM, Tue - 1 April 25

Vodafone Idea : ముకేశ్ అంబానీకి చెందిన జియో టెలికాం వచ్చినప్పటి నుంచి బిర్లా గ్రూపునకు చెందిన వొడాఫోన్ ఐడియా నష్టాల బాటలో పయనిస్తోంది. ప్రస్తుతం స్పెక్ట్రమ్ చెల్లింపులు కూడా చేయలేని దుస్థితిలో వొడాఫోన్ ఐడియా ఉంది. ఈ పరిస్థితుల నడుమ వొడాఫోన్ ఐడియాలోని దాదాపు రూ.37 వేల కోట్లు విలువైన షేర్లను కేంద్ర ప్రభుత్వం సొంతం చేసుకోనుంది. ఈ మేరకు విలువ చేసే వొడాఫోన్ ఐడియా షేర్లను ఈక్విటీ వాటాలుగా సర్కారు మార్చేయనుంది. దీంతో ఈ కంపెనీలో భారత ప్రభుత్వానికి ఉన్న వాటా 22.6 శాతం నుంచి 48.99 శాతానికి పెరగనుంది. మరో 2 శాతం వాటాను గనుక వొడాఫోన్ ఐడియా నుంచి కేంద్రం కొనేస్తే.. మెజారిటీ వాటా సర్కారు చేతికి వస్తుంది. దీంతో భారత ప్రభుత్వానికి ఆ టెలికాం కంపెనీపై పూర్తి పట్టు వస్తుంది.
Also Read :Tushar Gandhi: గాంధీజీ ముని మనవడి పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు
నియంత్రణ.. కంపెనీ ప్రమోటర్లకే
వొడాఫోన్ ఐడియా(Vodafone Idea)లోని 48.99 శాతం వాటా ప్రభుత్వం చేతికి వచ్చినా.. దానిపై నియంత్రణ మాత్రం కంపెనీ ప్రమోటర్లకే ఉంటుంది. ఈ చర్య 2021 సెప్టెంబరులో ప్రకటించిన టెలికాం రంగ ఉపశమన ప్యాకేజీలో భాగమే. వొడాఫోన్ ఐడియా ఈవివరాలను మార్చి 30వ తేదీన ఈ సమాచారాన్ని స్టాక్ మార్కెట్లకు తెలియజేసింది. వీఐలోని వాటాలను కంపెనీల చట్టం, 2013లోని సెక్షన్ 62(4) ప్రకారం ప్రభుత్వానికి బదిలీ చేస్తారని తెలిపింది. టెలికాం మంత్రిత్వ శాఖ మార్చి 29న దీనికి సంబంధించి ఒక ఉత్తర్వును జారీ చేసింది.
Also Read :PM Modi 75 : సెప్టెంబరు 17 నాటికి మోడీకి 75 ఏళ్లు.. రిటైర్మెంట్ ఏజ్ అదేనా ?
రూ.10 చొప్పున 3,695 కోట్ల ఈక్విటీ షేర్లు
వొడాఫోన్ ఐడియా కంపెనీకి చెందిన ఒక్కో షేరును రూ.10 చొప్పున 3,695 కోట్ల ఈక్విటీ షేర్లను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేస్తారు. ఈ ఇష్యూ ధరను గత 90 ట్రేడింగ్ రోజులు లేదా 10 ట్రేడింగ్ రోజుల వాల్యూమ్-వెయిటెడ్ సగటు ధర ఆధారంగా నిర్ణయించారు. కంపెనీ ఇప్పుడు ఈ ప్రక్రియను 30 రోజుల్లోగా పూర్తి చేయాలి. అయితే ఇది సెబీ, ఇతర నియంత్రణ సంస్థల ఆమోదంపై ఆధారపడి ఉంటుంది.