UPI Transactions Data: సరికొత్త రికార్డు సృష్టించిన యూపీఐ పేమెంట్స్.. గతేడాదితో పోలిస్తే 31 శాతం జంప్!
గత నెలలో UPI ద్వారా ప్రతిరోజూ రూ. 50.1 కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. ఆగస్టు నెలలో ఈ సంఖ్య 48.3 కోట్లుగా నమోదైంది.
- By Gopichand Published Date - 06:45 PM, Wed - 2 October 24

UPI Transactions Data: యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ (UPI Transactions Data) ఇంటర్‌ఫేస్ భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల ప్రపంచాన్ని విప్లవాత్మకంగా మార్చింది. ప్రస్తుతం పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు అందరూ యూపీఐని ఉపయోగిస్తున్నారు. మీరు కిరాణా సామాగ్రిని కొనుగోలు చేయాలన్నా లేదా ఆన్‌లైన్ షాపింగ్ చేయాలన్నా UPI చెల్లింపులను చాలా సులభం చేసింది. అదే సమయంలో సెప్టెంబర్‌లో UPI అన్ని రికార్డులను బద్దలు కొట్టింది.
సెప్టెంబర్ నెలలో UPI ద్వారా మొత్తం రూ. 20.64 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయి. ఇది గత సంవత్సరం కంటే 31% ఎక్కువ. ఇది మాత్రమే కాదు లావాదేవీల సంఖ్య కూడా 42% పెరిగి 15.04 బిలియన్లకు చేరుకుంది. ఈ గణాంకాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే NPCI ఇటీవల విడుదల చేసింది.
Also Read: Ola Electric Scooters: రూ. 49 వేలకే ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్!
గత నెలలో కూడా కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగాయి
గత నెలలో UPI ద్వారా ప్రతిరోజూ రూ. 50.1 కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. ఆగస్టు నెలలో ఈ సంఖ్య 48.3 కోట్లుగా నమోదైంది. గత ఐదు నెలలుగా నెలవారీ UPI లావాదేవీల విలువ రూ. 20 లక్షల కోట్ల కంటే ఎక్కువగా ఉంది. ఇది భారీ సంఖ్య.
ఇతర చెల్లింపు పద్ధతులలో కూడా పెరుగుదల
AEPS: సెప్టెంబర్‌లో దాదాపు 10 కోట్ల లావాదేవీలు జరిగాయి. మొత్తం విలువ రూ. 24,143 కోట్లు.
IMPS: సెప్టెంబర్‌లో రూ. 5.65 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. ఇది వార్షిక ప్రాతిపదికన 11% ఎక్కువ.
ఫాస్ట్‌ట్యాగ్: సెప్టెంబర్‌లో 31.8 కోట్ల లావాదేవీలు జరిగాయి. 7% వృద్ధి చెందాయి.
డిజిటల్ లావాదేవీలు పెరిగాయి
దేశంలో డిజిటల్ లావాదేవీలకు పెరుగుతున్న ఆదరణను ఈ గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. ఈ నివేదికపై వరల్డ్‌లైన్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సునీల్ రోంగ్లా మాట్లాడుతూ.. ప్రజలు ఇప్పుడు చిన్న లావాదేవీల కోసం UPIని ఎక్కువగా ఉపయోగిస్తున్నారన్నారు.