HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Sean Rivers Grow Stocks Suddenly Went Lower Circuit With A Huge Increase

Share Market : సీన్ రివర్స్.. భారీగా పెరిగి ఒక్కసారిగా గ్రో స్టాక్స్ లోయర్ సర్క్యూట్.!

  • Author : Vamsi Chowdary Korata Date : 19-11-2025 - 1:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Groww Share
Groww Share

ఇటీవలి కాలంలో ఎంట్రీతోనే అద్భుత రిటర్న్స్ ఇచ్చిన ఐపీఓల్లో.. బిలియన్‌బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. అదే గ్రో లిమిటెడ్. 5 రోజుల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 94 శాతం వరకు పెరిగింది. అయితే.. ఇంకా పెరుగుతుందనుకునేలోపు బుధవారం సెషన్‌లో 10 శాతం లోయర్ సర్క్యూట్ కొట్టింది. దీంతో ఇన్వెస్టర్లకు లాభాలు తగ్గాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.

ఇటీవల స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టయిన ఐపీఓల్లో గ్రో లిమిటెడ్ పేరెంట్ కంపెనీ బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ గురించి ప్రధానంగా మాట్లాడుకోవాలి. ఇది మంచి ప్రీమియంతో లిస్టింగ్ కాకపోయినా.. తర్వాత దుమ్మురేపింది.వరుసగా 5 సెషన్లు అదరగొట్టి దాదాపు డబుల్ రిటర్న్స్ ఇచ్చిన ఈ స్టాక్.. బుధవారం సెషన్‌లో మాత్రం పడిపోయింది. ఏ దశలోనూ కిందటి ధరను దాటి వెళ్లలేకపోయింది. స్టాక్ మార్కెట్ సూచీలు ఒడుదొడుకుల్లో ట్రేడవుతుండగా.. ఇదే క్రమంలో వరుసగా పతనం అవుతూ వచ్చి.. 10 శాతం లోయర్ సర్క్యూట్ కొట్టింది. దీంతో ఇన్వెస్టర్ల లాభాలు తగ్గడం లేదా కొత్తగా ఇన్వెస్ట్ చేసిన వారికి నష్టాలు వచ్చాయని చెప్పొచ్చు.

మంగళవారం సెషన్‌లో రూ. 188.77 వద్ద ఈ షేరు ముగియగా.. ఇవాళ స్వల్ప నష్టంతో రూ. 187.99 వద్ద ఓపెన్ అయింది. చివరికి 10 శాతం నష్టంతో (లోయర్ సర్క్యూట్) రూ. 169.89 వద్ద స్థిర పడింది. ఇప్పుడు కూడా ఐపీఓ ధరతో పోలిస్తే 69.89 శాతం ఎక్కువే ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 1.05 లక్షల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ట ధర రూ. 193.80 కాగా.. కనిష్ట ధర రూ. 112 గా ఉంది.

వరుసగా 5 సెషన్లు పుంజుకున్న క్రమంలో.. ఈ లాభాల్ని సొమ్ము చేసుకునేందుకు.. ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగారు. దీంతో షేర్లలో విపరీతంగా అమ్మకాలు వెల్లువెత్తగా స్టాక్ లోయర్ సర్క్యూట్‌లో లాక్ అయింది. ఐపీఓ రూపంలో వచ్చిన ఈ ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌కు విపరీతమైన డిమాండ్ వచ్చిందని చెప్పొచ్చు. ఎన్నో రెట్ల మేర సబ్‌స్క్రిప్షన్ జరిగింది. అయితే.. ఆ మధ్య స్టాక్ మార్కెట్ ఒడుదొడుకుల్లో ఉండగా.. ప్రీమియం కాస్త తక్కువే వచ్చింది.

ఇష్యూ ధర రూ. 100 గా ఉండగా.. NSE లో నవంబర్ 12న రూ. 112 వద్ద లిస్టింగ్ అయింది. ఇక్కడ ప్రీమియం 12 శాతంగానే ఉందని చెప్పొచ్చు. అయితే అక్కడితో ఆగలేదు. అదేరోజు స్టాక్ ధర మరో 10 శాతానికిపైగా పెరిగింది. ఇంకా వరుసగా పెరుగుతూ వచ్చింది. దీంతో 5 రోజుల వ్యవధిలో రికార్డు స్థాయిలో స్టాక్ ధర 93.80 శాతం పెరిగింది. దాదాపు షేర్ ధర డబుల్ అయిందని చెప్పొచ్చు. ఐపీఓ ద్వారా విజయవంతంగా షేర్లు వచ్చిన వారికి.. 5 రోజుల్లో డబుల్ రిటర్న్స్ అందగా.. ఇప్పుడు స్టాక్ ధర పడిపోవడంతో ఆ లాభం తగ్గిందని చెప్పొచ్చు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bussiness
  • Groww Share Price
  • share market
  • shares

Related News

Tech Mahindra Layoffs

టెక్‌ మహీంద్రాలో 30వేల లేఆఫ్‌లంటూ వార్తలు..

Tech Mahindra Layoffs  ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ టెక్ మహీంద్రాలో భారీ స్థాయిలో లేఆఫ్స్ జరుగుతున్నాయని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఏకంగా 30 వేల మందిని తొలగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలపై టెక్ మహీంద్రా కీలక ప్రకటన చేసింది. ఉద్యోగుల తొలగింపుల వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన

  • Stock Market

    వార్‌ నష్టాలకు బ్రేక్‌.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు

Latest News

  • లోక్‌సభలో తెలంగాణను కించపరచలేదు.. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు క్లారిటీ

  • FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

  • చంద్రబాబు కీలక నిర్ణయాలు.. ఉగాది సందర్భంగా 2.5 లక్షల మందికి సీఎం కానుక!

  • Central Govt Good News : తెలంగాణకు కేంద్రం గొప్ప శుభవార్త

  • Mahesh Babu Fans : హరీష్ శంకర్ పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్ ..ఉస్తాద్ ఓపెనింగ్స్ కు ప్రమాదమా ?

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd