ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలైన భారతీయ సంతతి సీఈవో ఎవరో తెలుసా?
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ప్రకారం.. వారందరినీ వెనక్కి నెట్టి ఒక మహిళా సీఈఓ అగ్రస్థానంలో నిలిచారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వంటి దిగ్గజాలను కాదని అరిస్టా నెట్‌వర్క్స్ ప్రెసిడెంట్, సీఈఓ జయశ్రీ ఉల్లాల్ అత్యంత ధనవంతురాలైన భారతీయ సంతతి సీఈఓగా నిలిచారు.
- Author : Gopichand
Date : 27-12-2025 - 4:19 IST
Published By : Hashtagu Telugu Desk
Jayshree Ullal: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధనవంతులైన భారతీయ సంతతి ఎగ్జిక్యూటివ్‌ల గురించి మాట్లాడుకుంటే సాధారణంగా సత్య నాదెళ్ల లేదా సుందర్ పిచాయ్ పేర్లే వినిపిస్తాయి. కానీ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ప్రకారం.. వారందరినీ వెనక్కి నెట్టి ఒక మహిళా సీఈఓ అగ్రస్థానంలో నిలిచారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వంటి దిగ్గజాలను కాదని అరిస్టా నెట్‌వర్క్స్ ప్రెసిడెంట్, సీఈఓ జయశ్రీ ఉల్లాల్ అత్యంత ధనవంతురాలైన భారతీయ సంతతి సీఈఓగా నిలిచారు.
జయశ్రీ ఉల్లాల్ నికర ఆస్తి విలువ- ఆదాయం
నికర ఆస్తి: రూ. 50,170 కోట్లు.
రెవెన్యూ: ఆమె నాయకత్వంలో అరిస్టా నెట్‌వర్క్స్ 2024లో $7 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించింది (గత ఏడాది కంటే 20% వృద్ధి).
సత్య నాదెళ్ల ఆస్తి: రూ. 9,770 కోట్లు (రెండవ స్థానం).
సుందర్ పిచాయ్ ఆస్తి: రూ. 5,810 కోట్లు (ఏడవ స్థానం).
Also Read: పాకిస్థాన్‌లో మేధో వలసలు.. దేశాన్ని వీడుతున్న డాక్టర్లు, ఇంజనీర్లు!
జయశ్రీ ఉల్లాల్ ప్రస్థానం
మార్చి 27, 1961న లండన్‌లో జన్మించారు. ఆమెకు 5 ఏళ్ల వయసున్నప్పుడు వారి కుటుంబం భారత్‌కు వచ్చింది. ఢిల్లీలోని కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీలో పాఠశాల విద్యను అభ్యసించారు. ఆమె తండ్రి ఒక ఫిజిసిస్ట్ (భౌతిక శాస్త్రవేత్త). ఐఐటీల (IIT) స్థాపనలో ఆయన కీలక పాత్ర పోషించారు. శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్శిటీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీఎస్, శాంటా క్లారా యూనివర్శిటీ నుండి ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్‌లో ఎంఎస్ చేశారు. 2025లో ఆమెకు గౌరవ డాక్టరేట్ లభించింది.
సెమీకండక్టర్ రంగంలో కెరీర్ ప్రారంభించి, ఏఎండీ (AMD), ఫెయిర్‌చైల్డ్ సెమీకండక్టర్ వంటి సంస్థల్లో పనిచేశారు. 1993లో సిస్కో సంస్థలో చేరారు. అనంతరం 2008లో అరిస్టా నెట్‌వర్క్స్‌లో చేరి, ఆ సంస్థను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు.
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025- టాప్ 10 సీఈఓలు
- జయశ్రీ ఉల్లాల్ (అరిస్టా నెట్‌వర్క్స్)- రూ. 50,170
- సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్)- రూ. 9,770
- నికేశ్ అరోరా (పాలో ఆల్టో నెట్‌వర్క్స్)- రూ. 9,190
- ఇగ్నేషియస్ నవిల్ నోరోన్హా (అవెన్యూ సూపర్‌మార్ట్స్)- రూ. 6,570
- అజయ్‌పాల్ సింగ్ బంగా (వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్)- రూ. 5,970
- థామస్ కురియన్ (గూగుల్ క్లౌడ్)- రూ. 5,900
- సుందర్ పిచాయ్ (గూగుల్)- రూ. 5,810
- ఇందిరా నూయి (పెప్సికో – మాజీ సీఈఓ)- రూ. 5,130
- శాంతను నారాయణ్ (అడోబ్)- రూ. 4,670
- అజిత్ జైన్ (బెర్క్‌షైర్ హాత్వే)- రూ. 2,950