Aadhaar Card: ఆధార్ కార్డ్ పోయిందా? ఇంట్లోనే సులభంగా రికవర్ చేసుకోండి!
మీరు మీ ఆధార్ కార్డ్‌ను అనేక విధాలుగా తిరిగి పొందవచ్చు. UIDAI వెబ్‌సైట్ ద్వారా ఇమెయిల్ ద్వారా లేదా SMS ద్వారా. అంటే, మీరు ఇంట్లో కూర్చొని కూడా మీ ఆధార్‌ను రికవర్ చేసుకోవచ్చు.
- Author : Gopichand
Date : 10-12-2025 - 6:30 IST
Published By : Hashtagu Telugu Desk
Aadhaar Card: భారతదేశంలో ఆధార్ కార్డ్ (Aadhaar Card) అత్యంత ముఖ్యమైన పత్రం. 12 అంకెలతో కూడిన ఈ కార్డు బ్యాంక్ ఖాతా తెరవడం నుండి వెరిఫికేషన్, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందడం వరకు ఉపయోగపడుతుంది. అయితే మీ ఆధార్ కార్డ్ పోయినా, దెబ్బతిన్నా లేదా నీటిలో తడిచి పోయినా ఏమి చేయాలి? అనే ఆలోచనలో ఉన్నారా? అయితే ఆందోళన చెందకండి మీరు దానిని సులభంగా తిరిగి పొందవచ్చు. UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) ప్రకారం.. ఒక వ్యక్తి ఆధార్ కార్డ్ పోయినా లేదా నష్టపోయినా దానిని ఇంట్లో కూర్చునే సులభంగా తిరిగి పొందవచ్చు.
ఆధార్ కార్డ్‌ను ఎలా రికవర్ చేయాలి?
మీరు మీ ఆధార్ కార్డ్‌ను అనేక విధాలుగా తిరిగి పొందవచ్చు. UIDAI వెబ్‌సైట్ ద్వారా ఇమెయిల్ ద్వారా లేదా SMS ద్వారా. అంటే, మీరు ఇంట్లో కూర్చొని కూడా మీ ఆధార్‌ను రికవర్ చేసుకోవచ్చు. దీని కోసం మీ ఫోన్ నంబర్ రిజిస్టర్ అయి ఉండటం తప్పనిసరి. ఒకవేళ మీ ఫోన్ నంబర్ కూడా రిజిస్టర్ కాకపోతే మీరు సమీపంలోని ఆధార్ సెంటర్‌కు వెళ్లవలసి ఉంటుంది. UIDAI అందించే ఈ సదుపాయం లక్షలాది మందికి ఉపశమనం కలిగిస్తోంది. మీకు తరచుగా బ్యాంక్ ఖాతా, PAN కార్డు లింకింగ్ లేదా ప్రభుత్వ పథకాల కోసం ఆధార్ అవసరమైతే మీరు దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి.
Also Read: Breast Cancer: రొమ్ము క్యాన్సర్.. ప్రారంభ లక్షణాలు, స్వీయ పరీక్ష విధానం ఇదే!
SMS ద్వారా రికవరీ
అత్యంత సులువైన మార్గం SMS ద్వారా రికవరీ. చాలా మంది ఇదే పద్ధతిని అనుసరిస్తారు. దీని కోసం మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 51969కు ఈ విధంగా SMS పంపాలి. (యూడీ- 14 అంకెల నంబర్- పిన్‌కోడ్) పేరులో ఖాళీ (space) ఇవ్వకూడదు. పిన్ కోడ్ సరైనదిగా ఉండాలి. కొన్ని సెకన్లలోనే మీకు రిప్లై వస్తుంది. అందులో మీ ఆధార్ నంబర్ ఉంటుంది.
ఇమెయిల్ లేదా IVRS ద్వారా
ఇమెయిల్ ద్వారా: దీని కోసం మీరు getdetail.aadhaar@gmail.com కు ఇమెయిల్ చేయాలి. సబ్జెక్ట్ లైన్‌ను ఖాళీగా ఉంచి, ఇమెయిల్ బాడీలో UID తో పాటు పేరు, పిన్ కోడ్ రాయండి. మీకు ఒక రోజు లేదా 24 గంటలలోపు స్పందన వస్తుంది.
IVRS (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) ద్వారా: మీరు 1940కి కాల్ చేయడం ద్వారా కూడా రికవరీ చేయవచ్చు. కాల్ చేసిన తర్వాత వాయిస్ కమాండ్‌లను అనుసరించండి. మీకు ఆధార్ వివరాలు లభిస్తాయి.