Economic Changes: నేటి నుండి అమలులోకి వచ్చిన 6 ప్రధాన ఆర్థిక మార్పులీవే!
ఇకపై UPI ద్వారా ఒకేసారి రూ. 5 లక్షల వరకు లావాదేవీలు చేయవచ్చు. ఈ చర్య మోసాన్ని (Fraud), ఫిషింగ్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
- By Gopichand Published Date - 04:29 PM, Wed - 1 October 25

Economic Changes: నేటి నుండి (అక్టోబర్ 1, 2025) భారత ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా అనేక పెద్ద మార్పులను (Economic Changes) అమలు చేసింది. వీటి ప్రభావం సామాన్య ప్రజల రోజువారీ జీవితం, ఆర్థిక ప్రణాళికపై పడనుంది. UPI లావాదేవీల నుండి రైల్వే టిక్కెట్ల వరకు.. మీ జేబుపై ప్రభావం చూపే ఆ మార్పులు ఏమిటో తెలుసుకుందాం!
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో మార్పులు
అక్టోబర్ 1 నుండి NPSలో ప్రభుత్వేతర చందాదారులు మల్టిపుల్ స్కీమ్ ఫ్రేమ్‌వర్క్ (MSF) కింద 100% వరకు ఈక్విటీలో (Equity) పెట్టుబడి పెట్టవచ్చు. గతంలో ఈ పరిమితి 75% ఉండేది. అదనంగా PRAN (Permanent Retirement Account Number) ఓపెనింగ్ కోసం ప్రైవేట్ రంగ ఉద్యోగులు రూ. 18 ఇ-PRAN కిట్ ఫీజు, రూ. 100 వార్షిక మెయింటెనెన్స్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అటల్ పెన్షన్ యోజన (APY)- NPS లైట్ చందాదారుల కోసం PRAN ఓపెనింగ్, మెయింటెనెన్స్ ఛార్జీ రూ. 15 ఉంటుంది. లావాదేవీలపై (Transaction) అదనపు ఫీజు ఉండదు.
Also Read: RBI Monetary Policy: ఆర్బీఐ ద్రవ్య విధాన సమీక్ష.. వృద్ధి అంచనాలు పెంపు, రెపో రేటులో మార్పు లేదు!
రైల్వే టికెట్ బుకింగ్‌లో మార్పులు
అక్టోబర్ 1 నుండి, రైల్వే రిజర్వేషన్లు తెరిచిన మొదటి 15 నిమిషాలు కేవలం ఆధార్ ధృవీకరణ (Aadhaar Verify) చేసుకున్న వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. PRS కౌంటర్ నుండి టిక్కెట్లు తీసుకునే వారికి ఈ నిబంధన వర్తించదు. టిక్కెట్ బుకింగ్‌లో అవకతవకలను అరికట్టేందుకు రైల్వే ఏజెంట్లు రిజర్వేషన్లు ప్రారంభమైన మొదటి 10 నిమిషాల వరకు టిక్కెట్లు బుక్ చేయలేరు.
ఆన్‌లైన్ గేమింగ్ నియమాలు
ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు 2025 ప్రకారం.. అక్టోబర్ 1 నుండి 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఆన్‌లైన్ రియల్ మనీ గేమింగ్‌లో పాల్గొనడానికి వీలు లేదు. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే 3 సంవత్సరాల జైలు శిక్ష మరియు రూ. 1 కోటి వరకు జరిమానా విధించవచ్చు. ప్రమోటర్లకు రెండు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 50 లక్షల జరిమానా విధించవచ్చు. ఇ-స్పోర్ట్స్‌ను ప్రోత్సహించడం, ఆర్థిక నష్టాన్ని నియంత్రించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటోంది.
వంట గ్యాస్ ధరలలో మార్పులు
అక్టోబర్ 1 నుండి ఆయిల్ కంపెనీలు దేశీయ వంట గ్యాస్ సిలిండర్ల ధరలలో మార్పులు చేస్తున్నాయి. ఇది ప్రజల వంటగదిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.
UPI లావాదేవీలలో మార్పులు
ఇకపై UPI ద్వారా ఒకేసారి రూ. 5 లక్షల వరకు లావాదేవీలు చేయవచ్చు. ఈ చర్య మోసాన్ని (Fraud), ఫిషింగ్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
పోస్టల్ సేవ- స్పీడ్ పోస్ట్ మార్పులు
స్పీడ్ పోస్ట్ కొత్త సదుపాయాలలో OTP ఆధారిత డెలివరీ, రియల్-టైమ్ ట్రాకింగ్, ఆన్‌లైన్ బుకింగ్, SMS నోటిఫికేషన్‌లు ఉన్నాయి. విద్యార్థులకు 10%, కొత్త భారీ వినియోగదారులకు (Bulk Customers) 5% వరకు తగ్గింపు కూడా వర్తిస్తుంది. ఈ మార్పులు మీ ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడి, ప్రయాణం, రోజువారీ అవసరాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపవచ్చు.