HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Good News For Gold Lovers Gold Prices Have Dropped Sharply 2

Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

  • Author : Vamsi Chowdary Korata Date : 09-07-2026 - 11:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Good news for gold lovers: Gold prices have dropped sharply.
Good news for gold lovers: Gold prices have dropped sharply.

పసిడి ప్రియులకు  శుభవార్త అందుతుంది. మళ్లీ ధరలు భారీగా పడిపోతున్నాయి. ఇటీవల భారీ పతనం తర్వాత తగ్గుతూ వచ్చిన గోల్డ్, సిల్వర్ రేట్లు మళ్లీ పెరిగిన సంగతి తెలిసిందే. అరెరే పెరుగుతుంది అని కొనుగోలుదారులు అనుకునే లోపే మళ్లీ ఒక్కసారిగా దిగొస్తున్నాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగగా అనిశ్చితి నెలకొంది. మరోసారి ఇరాన్ నౌకలపై అమెరికా భీకర దాడులు చేసింది. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం కూడా ముగిసినట్లేనని ట్రంప్ ప్రకటించడంతో మళ్లీ యుద్ధం మొదలైనట్లే కనిపిస్తుంది. ఇరాన్ చమురు విక్రయాలపై అమెరికా ఆంక్షల్ని మళ్లీ తీసుకురాగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు ప్రస్తుతం 80 డాలర్లకు అత్యంత సమీపంలో ఉంది. క్రూడ్ ధరలు పెరగడంతో సాధారణంగానే బంగారం, వెండి వంటి లోహాలు ఆకర్షణ కోల్పోతున్నాయి. దీంతో ధరలు దిగొస్తూనే ఉన్నాయి. వరుసగా మూడోరోజు రేట్లు తగ్గగా, 2 రోజుల్లో భారీ పతనం కనిపించింది.

ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే గత 2 రోజుల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు విపరీతంగా తగ్గాయని చెప్పొచ్చు. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ప్రస్తుతం 4070 డాలర్లకు దిగొచ్చింది. కిందటి రోజు ఇది 4120 వద్ద ఉండేది. ఇక సిల్వర్ రేటు కూడా 61 డాలర్ల స్థాయి నుంచి 58 డాలర్లకు పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ. 95.55 వద్ద ఉంది.

ఇక దేశీయంగా కూడా ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. బుధ – గురువారం మధ్య చూస్తే 22 క్యారెట్ల పసిడి ధర తాజాగా రూ. 1950 తగ్గింది; హైదరాబాద్ నగరంలో ఇప్పుడు గురువారం ఉదయం 7 గంటలకు తులం రూ. 1,31,200 వద్ద ఉంది. ఇది కిందటి రోజు కూడా రూ. 1250 తగ్గింది. గత 3 రోజుల్లో చూస్తే ఏకంగా రూ. 3300 తగ్గింది. ఇదే సమయంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 2130 తగ్గడంతో, ఇది ఇప్పుడు 10 గ్రాములకు రూ. 1,43,130 వద్ద ఉంది. కిందటి రోజు ఇది రూ. 1360 తగ్గింది.

బంగారం ధరల బాటలో వెండి రేట్లు కూడా పతనం అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు రూ. 5 వేలు తగ్గి ప్రస్తుతం కేజీకి రూ. 2.45 లక్షల వద్ద కొనసాగుతోంది. దీనికి ముందు జులై 6న సిల్వర్ రేటు రూ. 10 వేలు తగ్గింది. అంతకుముందు జులై 2-3 తేదీల్లో రూ. 15 వేలు పెరిగింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 22K gold rate
  • 24 Carat Gold Rate
  • 24 Carat Gold Rate Down
  • 24 carat gold rate today
  • 24K gold rate
  • Check Gold Rates
  • Daily gold price
  • Global Gold Prices
  • Gold market
  • gold market . today gold price
  • gold price
  • gold sliver
  • sliver price
  • today gold price

Related News

Good news for gold lovers: Gold prices have dropped sharply.

Gold Rate: మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం కొనాలనుకునే వారికి బులియన్ మార్కెట్ భారీ తీపి కబురు అందించింది. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ఒక్కసారిగా భారీగా దిగివచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ వివరాల ప్రకారం.. సాధారణంగా ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర ఏకంగా రూ. 1,250 మేర పతనమై, ప్రస్తుతం రూ. 1,33,150 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచే

  • Good news for gold lovers: Gold and silver prices have dropped again.

    Gold Price: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మరోసారి దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

Latest News

  • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

  • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

  • LPG gas cylinder: భారీ వర్షాలకు కొట్టుకొస్తున్న 3,000 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd