Gold Prices: రికార్డు ధర నుంచి రూ. 9,000 తగ్గిన బంగారం ధర!
రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే, బంగారం, వెండి వ్యాపారంతో సంబంధం ఉన్నవారు 2026 నాటికి బంగారం రూ. 2 లక్షలకు చేరుకోవచ్చని, వెండి రూ. 2.5 లక్షల మార్కును తాకవచ్చని అంచనా వేస్తున్నారు.
- By Gopichand Published Date - 03:30 PM, Sun - 26 October 25
Gold Prices: దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Prices) వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. రికార్డు గరిష్ట ధరల నుంచి బంగారం ఇప్పుడు దాదాపు రూ. 9,000 వరకు తగ్గింది. ఒకానొక సమయంలో ప్రతి 10 గ్రాములకు రూ. 1,33,000కు చేరువైన 24 క్యారెట్ల బంగారం ధరలు ఇప్పుడు MCX (మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్)లో రూ. 1,23,255కి చేరుకున్నాయి. ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకారం.. 24 క్యారెట్ల బంగారం ధర ప్రతి 10 గ్రాములకు రూ. 1,22,419గా ఉంది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర ప్రతి 10 గ్రాములకు రూ. 1,25,620గా నమోదైంది. రికార్డు గరిష్ట ధరలతో పోలిస్తే బంగారం ధరలు రూ. 8,000 నుండి రూ. 10,000 వరకు చౌకగా లభిస్తున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లోనూ స్పాట్ గోల్డ్ ధరల్లో 6% కంటే ఎక్కువ పతనం కనిపించింది. ఔన్సుకు రికార్డు గరిష్టంగా $4,381.21కి చేరిన బంగారం ధర ఇప్పుడు $4,100 చుట్టూ తిరుగుతోంది. ఇది 2013 తర్వాత ఒకే రోజులో నమోదైన అతిపెద్ద నష్టం.
Also Read: DCC Presidents: డీసీసీ అధ్యక్షుల నియామకంపై కొత్త నిబంధనలు.. వారికి పదవులు కష్టమే!
బంగారం, వెండి ధరల్లో భారీ పతనం
బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల నమోదైంది. రికార్డు గరిష్ట స్థాయి రూ. 1,32,294 (10 గ్రాములకు) నుంచి MCXలో బంగారం ధర రూ. 1,23,255 (10 గ్రాములకు)కి పడిపోయింది. అదేవిధంగా ఈ నెల ప్రారంభంలో రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్న వెండి ధరలు 15వ తేదీన కిలోకు రూ. 1,85,000కు చేరిన తర్వాత శుక్రవారం నాటికి కిలోకు రూ. 1.47 లక్షల వద్ద ముగిసింది. గత 10 రోజుల్లో వెండి ధరలు కిలోకు సుమారు రూ. 38,000 తగ్గాయి.
రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే, బంగారం, వెండి వ్యాపారంతో సంబంధం ఉన్నవారు 2026 నాటికి బంగారం రూ. 2 లక్షలకు చేరుకోవచ్చని, వెండి రూ. 2.5 లక్షల మార్కును తాకవచ్చని అంచనా వేస్తున్నారు.
దేశంలో 24, 22, 18 క్యారెట్ల బంగారం ధరలు
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, ప్రస్తుత ధరలు ఇలా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం ధర: ప్రతి గ్రాముకు రూ. 12,562. దీని ప్రకారం 10 గ్రాముల ధర రూ. 1,25,620. 100 గ్రాముల ధర రూ. 12,56,200గా ఉంది.
22 క్యారెట్ల బంగారం ధర: ప్రతి గ్రాముకు రూ. 11,515. ఈ లెక్కన 10 గ్రాముల ధర రూ. 1,15,150. 100 గ్రాముల ధర రూ. 11,51,500గా ఉంది.
18 క్యారెట్ల బంగారం ధర: ప్రతి గ్రాముకు రూ. 9,422. ఈ విధంగా 10 గ్రాముల ధర రూ. 94,220. 100 గ్రాముల ధర రూ. 9,42,200గా ఉంది.