HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Gold Feels The Heat Of War

Gold Price: పసిడికి యుద్ధ సెగ..

  • Author : Vamsi Chowdary Korata Date : 25-03-2026 - 11:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Good news for gold lovers: Gold prices have dropped sharply.
Good news for gold lovers: Gold prices have dropped sharply.

GOLD  పసిడి ప్రియులకు అదిరే శుభవార్త. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. వరుసగా ఏడో రోజూ పసిడి రేట్లు దిగివచ్చాయి. ఇరాన్ పై దాడులను 5 రోజుల పాటు ఆపేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినా బంగారం ధరల పతనానికి బ్రేకులు వేయలేకపోయారు. మార్చి 25వ తేదీన పసిడి ధరలు మరింత పడిపోయాయి. ఈ క్రమంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22, 24 క్యారెట్ల బంగారం, కిలో వెండి రేట్లు ఎంత మేర తగ్గాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధానికి తాత్కాలికంగా బ్రేకులు వేసినట్లు ప్రకటించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇరాన్‌లోని ఇంధన, విద్యుత్తు కేంద్రాలపై దాడులు 5 రోజులు ఆపేస్తున్నామని ట్రంప్ ప్రకటించినప్పటికీ ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో ప్రపంచ మార్కెట్లపై యుద్ధ ప్రభావం కొనసాగుతోంది. ట్రంప్ ప్రకటన తర్వాత బంగారం ధరలు కాస్త పెరిగినట్లు కనిపించినా వెంటనే ఇరాన్ ప్రకటన రావడంతో మళ్లీ పడిపోయాయి. చమురు ధరల పెరుగుదల, డాలర్ విలువ పుంజుకోవడం, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగించడం వంటి అనేక కారణాలు బంగారం ధరలు భారీగా పడిపోయేందుకు కారణమవుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఇప్పట్లో ఆగకపోవచ్చన్న అంచనాలు, బాండ్ ఈల్డ్స్‌కు పెరిగిన గిరాకీతో సురక్షితమైన పెట్టుబడి మార్గంగా బంగారానికి బదులు డాలర్ బాండ్స్‌ను ఎంచుకుంటున్నారు. దీంతో పసిడి రేట్లు పడిపోతున్నాయి. ఈ క్రమంలో మార్చి 25వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మాత్రం వరుసగా తగ్గి ఈరోజు ఒక్కసారిగా పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 184 డాలర్ల మేర దూసుకుపోయింది. దీంతో ప్రస్తుతం ఔన్స్ బంగారం రేటు 4589 డాలర్ల స్థాయికి ఎగబాకింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్స్ ధర 7.40 డాలర్లు పెరగడంతో ప్రస్తుత ధర 74 డాలర్లు దాటింది. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై ఉంటుందని బులియన్ మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

హైదరాబాద్‌లో బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు మళ్లీ తగ్గాయి. వరుసగా 7వ రోజూ బంగారం ధరలు తగ్గడం గమనార్హం. ఈ వారం రోజుల్లో తులం బంగారం దాదాపు రూ.15000 వరకు పడిపోయింది. ఈరోజు చూసుకుంటే 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములపై రూ.380 మేర దిగివచ్చింది. దీంతో తులం గోల్డ్ రేటు రూ.1,42,910 వద్దకు తగ్గింది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.350 మేర తగ్గడంతో తులం ధర రూ. 1,31,000 వద్దకు తగ్గింది.

స్థిరంగా వెండి రేటు

బంగారం ధర మరింత పడిపోయినప్పటికీ వెండి రేటు మాత్రం స్థిరంగానే కొనసాగుతోంది. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు ఎటువంటి మార్పు లేకుండా రూ.2,50,000 వద్ద అమ్ముడవుతోంది.

పైన చెప్పిన బంగారం, వెండి ధరలు మార్చి 25వ తేదీ బుధవారం రోజు ఉదయం 7 గంటల సమయానికి ఉన్నవి. అయితే, బులియన్ మార్కెట్లో పసిడి ధరలు మధ్యాహ్నం లోపు మారిపోతుంటాయి. కొనుగోలు చేయాలనుకుంటున్న వారు స్థానిక జువెలర్స్ వద్ద కొనుగోలు చేసే ముందే ధరలు తెలుసుకోవడం మంచిది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 22K gold price
  • 24K gold price
  • 24K gold rate
  • Daily gold price
  • Global Gold Prices
  • gold market . today gold price
  • Gold Prices Hike
  • Gold Prices In Hyderabad
  • Gold Prices in India
  • Gold Prices Today
  • gold sliver
  • sliver price

Related News

Good news for gold lovers: Gold prices have dropped sharply.

Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

పసిడి ప్రియులకు  శుభవార్త అందుతుంది. మళ్లీ ధరలు భారీగా పడిపోతున్నాయి. ఇటీవల భారీ పతనం తర్వాత తగ్గుతూ వచ్చిన గోల్డ్, సిల్వర్ రేట్లు మళ్లీ పెరిగిన సంగతి తెలిసిందే. అరెరే పెరుగుతుంది అని కొనుగోలుదారులు అనుకునే లోపే మళ్లీ ఒక్కసారిగా దిగొస్తున్నాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగగా అనిశ్చితి నెలకొంది. మరోసారి ఇరాన్ నౌకలపై అమెరికా భీకర దాడులు చేసింది. రెండు దేశాల

  • Good news for gold lovers: Gold prices have dropped sharply.

    Gold Rate: మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

  • Good news for gold lovers: Gold and silver prices have dropped again.

    Gold Price: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మరోసారి దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd