Saree Draper : చీరకట్టును బిజినెస్‌గా మార్చేసి.. అంబానీలను క్లయింట్లుగా చేసేసి..
Saree Draper : కాదేది వ్యాపారానికి అతీతం అని డాలీ జైన్ చాటిచెప్పింది.
- By Pasha Published Date - 03:26 PM, Wed - 17 April 24

Saree Draper : కాదేది వ్యాపారానికి అతీతం అని డాలీ జైన్ చాటిచెప్పింది. చివరకు చీరకట్టును కూడా ఆమె బిగ్ బిజినెస్‌గా మార్చేసింది. ఏకంగా అంబానీల కుటుంబాల మహిళలను తన క్లయింట్లుగా చేసుకుంది. ఒక్కో చీరకట్టుకు లక్షల్లో ఛార్జీని వసూలు చేసేంతగా డాలీ జైన్ ఫేమసైంది. ఇంతకీ ఎవరామె ? ఈ ప్రొఫెషన్‌ను ఎందుకు చేపట్టారు.. ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
డాలీ జైన్ కెరీర్ గ్రాఫ్
- డాలీ జైన్ బెంగళూరు వాస్తవ్యురాలు. తన తల్లి చీరకట్టును(Saree Draper) చూసి ఆమె బాగా ఇంప్రెస్ అయ్యేవారు. తల్లే ఆమెకు మొదటి గురువు. అమ్మ దగ్గరే చీరకట్టు స్కిల్స్‌ను తొలుత డాలీ నేర్చుకుంది.
- ఆమెకు కోల్‌కతాకు చెందిన వ్యక్తితో పెళ్లవడంతో అక్కడికి వెళ్లిపోయింది.
- కోల్‌కతాలో ఉంటున్న టైంలోనే చీరకట్టును వృత్తిగా మల్చుకోవాలనే ఆలోచన డాలీకి వచ్చింది. దీంతో ఆమె 357 రకాల చీరకట్టు పద్ధతుల గురించి నేర్చుకున్నారు.
- హైదరాబాదీ నుంచి గుజరాతీ వరకు, రాజస్థానీ నుంచి అస్సామీ వరకు వివిధ ప్రాంతాలకు చెందిన విభిన్నమైన చీరకట్టు పద్ధతులపై అవగాహన పెంచుకున్నారు.
- చీరకట్టు ప్రొఫెషన్ వైపు వెళ్లాలనే డాలీ ఆసక్తిని కుటుంబంలో అందరూ వ్యతిరేకించారు. డాలీ తండ్రి మాత్రమే వెన్నుతట్టి ప్రోత్సహించారు.
- 2011 సంవత్సరంలో అత్యంత వేగంగా(18.5 సెకన్లు) చీరను కట్టుకొని సరికొత్త రికార్డును డాలీ సొంతం చేసుకుంది. ఈవిధంగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి ఆమెకు తొలి సర్టిఫికెట్ వచ్చింది.
Also Read :Constable To CIVILS : నాడు కానిస్టేబుల్.. నేడు సివిల్స్ ర్యాంకర్.. కాబోయే ‘ఐఆర్ఎస్’!
- చీరకట్టు పద్ధతులపై దేశంలోని వివిధ నగరాల వీఐపీ మహిళలకు డాలీ జైన్ ట్రైనింగ్ కూడా ఇచ్చారు.
- ఈక్రమంలో ఓసారి డిజైనర్ సందీప్ ఖోస్లాను కలిసే అవకాశం డాలీకి దక్కింది.
- డాలీ జైన్ ట్యాలెంటును చూసిన సందీప్ ఖోస్లా ఆమె పేరును తన వీఐపీ క్లయింట్స్‌కు సిఫార్సు చేశారు.
- ఇప్పుడు డాలీ జైన్ వీఐపీ క్లయింట్ల లిస్టులో ఇషా అంబానీ, నీతా అంబానీ, శ్లోకా అంబానీ, రాధికా మర్చంట్, సోనమ్ కపూర్, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, దీపికా పదుకునే వంటివారు ఉన్నారు.
Also Read :Aap Ka Ram Rajya : ‘ఆప్ కా రామ్ రాజ్య’ విడుదలైంది.. ఏమిటో తెలుసా ?
- జాతీయ అవార్డు అందుకునేటప్పుడు ఆలియా భట్ ధరించిన చీరను కట్టింది డాలీయే.
- అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలో నీతా అంబానీకి సొగసైన చీరను కట్టింది డాలీయే.