Sebi Chief : ఆ స్టాక్స్‌లో సెబీ చీఫ్ ట్రేడింగ్.. కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు
2018-19 ఆర్థిక సంవత్సరంలో కూడా ‘సెబీ’ చీఫ్ మాధవీ పురి బుచ్(Sebi Chief) చాలానే స్టాక్స్‌లో ట్రేడింగ్ చేశారని పవన్ ఖేరా చెప్పారు.
- By Pasha Published Date - 05:00 PM, Sat - 14 September 24

Sebi Chief : భారత స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’ చీఫ్ మాధవీ పురి బుచ్‌పై కాంగ్రెస్ పార్టీ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. సెబీ ఛైర్‌పర్సన్ హోదాను ఆమె దుర్వినియోగం చేసి కొన్ని కంపెనీల స్టాక్స్‌లో రూ.36.9 కోట్లు విలువైన ట్రేడింగ్ చేశారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు. 2017 సంవత్సరం నుంచి 2023 సంవత్సరం మధ్యకాలంలో ఈ ట్రేడింగ్ చేశారని తెలిపారు. శనివారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈవివరాలను ఆయన వెల్లడించారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో కూడా ‘సెబీ’ చీఫ్ మాధవీ పురి బుచ్(Sebi Chief) చాలానే స్టాక్స్‌లో ట్రేడింగ్ చేశారని పవన్ ఖేరా చెప్పారు. అప్పట్లో దాదాపు రూ.19.54 కోట్లు విలువైన ట్రేడింగ్ చేశారని తెలిపారు.
Also Read :Zika Vaccine : జికా వ్యాక్సిన్ తయారీకి ట్రయల్స్.. హైదరాబాదీ కంపెనీకి కాంట్రాక్ట్
కొన్ని విదేశీ ఫండ్లలోనూ ‘సెబీ’ చీఫ్ మాధవీ పురి బుచ్ పెట్టుబడులు పెట్టారని పవన్ ఖేరా వెల్లడించారు. ఆ లిస్టులో కొన్ని చైనా కంపెనీల ఫండ్స్ కూడా ఉన్నాయని చెప్పారు. గ్లోబల్ X MSCI చైనా కన్స్యూమర్, ఇన్వెస్కో చైనా టెక్నాలజీ ETF సహా మొత్తం నాలుగు అంతర్జాతీయ ఫండ్‌లలో సెబీ చీఫ్ పెట్టుబడులు పెట్టారని తెలిపారు. అయితే ఆ వివరాలను ప్రభుత్వానికి మాధవీ పురి బుచ్ నివేదించలేదని పవన్ ఖేరా గుర్తుచేశారు.
Also Read :Legality To Hydra : ‘హైడ్రా’కు చట్టబద్ధత.. వచ్చే నెలలోనే ఆర్డినెన్స్ : రంగనాథ్
‘‘సెబీ చీఫ్ స్వయంగా కొన్ని కంపెనీలలో ట్రేడింగ్ చేస్తున్నారని ప్రధాని మోడీకి ముందే తెలుసా ?’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఈసందర్భంగా ప్రశ్నించారు. ఆమె దేశం వెలుపల పెట్టుబడులు పెట్టారని ప్రధాని తెలుసా అని ఆయన నిలదీశారు. సెబీ చీఫ్‌కు సంబంధించిన పెట్టుబడుల వివరాలను అధికారికంగా విడుదల చేయాలని జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. చైనాతో కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ చైనా కంపెనీలలో సెబీ చీఫ్ పెట్టుబడులు పెట్టడంపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.