SEBI Chief : సెబీ చీఫ్‌గా ఉంటూ ఐసీఐసీఐ నుంచి శాలరీ తీసుకుంటారా ? : కాంగ్రెస్
మాధవీ పురీ బుచ్ ఇలా రెండుచోట్ల పనులు చేయడం క్విడ్ ప్రోకో కిందికి వస్తుందని ఆరోపించారు.
- By Pasha Published Date - 04:48 PM, Mon - 2 September 24
SEBI Chief : స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’ ఛైర్‌పర్సన్ మాధవీ పురీ బుచ్‌పై కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. ఆమె ఐసీఐసీఐ బ్యాంక్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ల నుంచి శాలరీలు తీసుకుంటూ సెబీ చీఫ్ హోదాలో ఎలా కొనసాగుతారని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ప్రశ్నించారు. మాధవీ పురీ బుచ్ ఇలా రెండుచోట్ల పనులు చేయడం క్విడ్ ప్రోకో కిందికి వస్తుందని ఆరోపించారు. ఆమె నైతికతకు, జవాబుదారీతనానికి తిలోదకాలు ఇస్తున్నారని పవన్ ఖేరా(SEBI Chief) పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join
ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. పవన్ ఖేరా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘సెబీ’ ఛైర్‌పర్సన్ మాధవీ పురీ బుచ్ ఒక కంపెనీలో పనిచేస్తూ ఒకచోట మాత్రమే వేతనం తీసుకోవాలి. 2017-2024 మధ్యకాలంలో ఐసీఐసీఐ బ్యాంక్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ల నుంచి ఆమె ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్లు కూడా తీసుకున్నారు. ఇలా చేయడం సెబీ నిబంధనలకు విరుద్ధం’’ అని ఆయన తెలిపారు. సెబీలో కీలక పదవిలో ఉంటూనే ఆమె ఐసీఐసీఐ నుంచి జీతం ఎందుకు తీసుకుంటున్నారనే దానిపై సమగ్ర విచారణ జరిపించాలని పవన్ ఖేరా డిమాండ్ చేశారు. ఆమె జీతం తీసుకోవడం వల్లే ఐసీఐసీఐపై జరగాల్సిన పలు విచారణలు ఆగిపోయాయని తెలిపారు.‘‘కేంద్ర క్యాబినెట్ అపాయింట్‌మెంట్ కమిటీయే సెబీ చీఫ్‌ను ఎంపిక చేస్తుంది. ఆ కమిటీలో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా లాంటి కీలక వ్యక్తులు ఉంటారు. అలాంటి కమిటీ వాళ్లు మాధవీ పురీ బుచ్ లాంటి వాళ్లకు సెబీ పగ్గాలు అప్పగించడం ఆందోళనకరం’’ అని పవన్ ఖేరా చెప్పారు.
Also Read :Trainee Doctor : మరో జూనియర్ వైద్యురాలి సూసైడ్.. కాలేజీ బిల్డింగ్ పైనుంచి దూకి..
- 2017 సంవత్సరం నుంచి మాధవీ పురీ బుచ్ సెబీ సభ్యురాలిగా ఉన్నారు.
- ఆమె 2022లో సెబీ ఛైర్‌పర్సన్ అయ్యారు.
- గత ఏఢేళ్లుగా మాధవీ పురీ బుచ్ రూ.16 కోట్లకుపైగా వేతనం తీసుకున్నారు.
Also Read :Lord Ganesh: కష్టాల నుంచి గట్టెక్కించే గణేష్ మంత్రాలు.. అవేంటంటే?
Related News
Yogesh Bairagi Vs Vinesh Phogat : రెజ్లర్ వినేష్ ఫోగట్‌పై పోటీకి యోగేశ్ బైరాగి.. ఎవరాయన ?
ఈక్రమంలోనే బీజేపీ యూత్ లీడర్, కెప్టెన్ యోగేశ్ బైరాగికి(Yogesh Bairagi Vs Vinesh Phogat) జులానా అసెంబ్లీ టికెట్‌ను కాషాయ పార్టీ కేటాయించింది.