Lord Ganesh: కష్టాల నుంచి గట్టెక్కించే గణేష్ మంత్రాలు.. అవేంటంటే?
కొన్ని రకాల సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యల నుంచి బయటపడటం కోసం విఘ్నేశ్వరుడి మంత్రాలు జపించడం వల్ల వాటి నుంచి బయటపడవచ్చట.
- By Nakshatra Published Date - 04:17 PM, Mon - 2 September 24
మామూలుగా మనం ఏదైనా మంచి పని చేసేటప్పుడు ఎటువంటి ఆటంకాలు ఉండకూడదు అని మొదటి పూజా విగ్నేశ్వరుడికి చేస్తూ ఉంటాం. ఒక శుభకార్యాలు మాత్రమే కాకుండా చాలా వరకు ఎక్కడ చూసినా కూడా మొదట విగ్నేశ్వరుని పూజిస్తూ ఉంటారు. అయితే ప్రతి పనిని ప్రారంభించేముందు గణేశున్ని పూజిస్తారు అని తన తండ్రి శివుడు దగ్గర దగ్గర్నుంచి విగ్నేశ్వరుడు ఆశీర్వాదం తీసుకున్న విషయం తెలిసిందే. అలాంటి విజ్ఞేశ్వరుడు జన్మదిన వేడుకలను వినాయక చవితిగా జరుపుకుంటూ ఉంటారు.
దాదాపు మూడు రోజుల నుంచి 11 రోజుల వరకు ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే విజ్ఞాలకు అధిపతి అయిన ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలగాలి అన్న మనం ఎదుర్కొనే సమస్యల నుంచి విముక్తి పొందాలి అన్న కొన్ని మంత్రాలు పటించాల్సిందే అంటున్నారు పండితులు. మరి కష్టాల నుంచి గట్టెక్కించే ఆ మంత్రాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
“ఓం గాం గణపతి నమ:”
“ఓం గాం గణపతి నమ:”
ఇది గణేశుడి యొక్క మూల మంత్రం. దీనిని బీజ మంత్రం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి ముందు ఈ మంత్రాన్ని ఉపయోగించడం వల్ల అంతా మంచే జరుగుతుందట. కొత్త పని ప్రారంభించే ముందు ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇబ్బందులు లేకుండా విజయం లభిస్తుందని ఈ పండితులు చెబుతున్నారు.
“ఓం శ్రీ గణేశాయ నమ:”
“ఓం శ్రీ గణేశాయ నమ:”
ఇది ప్రార్థన అలాగే ఆరాధన మంత్రంగా చెప్పాలి. ఒక పని లేదా ప్రాజెక్ట్ మొదలు పెట్టేముందు ఈ మంత్రాన్ని చదివి గణేశుడిని స్మరించుకోవడం వల్ల అంతా మంచే జరుగుతుందట. ఆయన అనుగ్రహం కూడా కలుగుతుందని చెబుతున్నారు.
“ఓం ఏకాదంతయ నమ: ”
“ఓం ఏకాదంతయ నమ: ”
ఈ మంత్రం ఏనుగు ముఖంలో ఒక దంతాన్ని సూచిస్తుంద. ఇది దేవుడు ద్వంద్వత్వాన్ని విచ్ఛిన్నం చేసిందని మరియు సంపూర్ణ మనస్సును కలిగి ఉండాలని సూచిస్తుంది. ఒకే మనసు గల భక్తి భావంతో ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వారు అనుకున్నది సాధిస్తారని పండితులు చెబుతున్నారు.
“ఓం సుముఖాయ నమ:”
“ఓం సుముఖాయ నమ:”
ఈ మంత్రానికి అనేక అర్థాలు ఉన్నాయి. ఈ మంత్రాన్ని ధ్యానించినప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణం గౌరవాన్ని పొందుతారు. అలాగే ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మనశ్శాంతి లభిస్తుందట.
“ఓం క్షిప్రా ప్రసాదయ నమ:”
“ఓం క్షిప్రా ప్రసాదయ నమ:”
క్షిప్రా అంటే వెంటనే. కొంత ప్రమాదం లేదా ప్రతికూల శక్తి మీ దారిలోకి వస్తే, ఆ ప్రమాదాన్ని ఎలా వదిలించుకోవాలో తెలియని వారు నిజమైన భక్తితో ఈ మంత్రాన్ని జపించడం వల్ల త్వరగా మీరు అనుకున్న ఆ ప్రమాదం నుంచి ఈజీగా బయటపడతారు.
“ఓం భాలాచంద్రయ నమ:”
“ఓం భాలాచంద్రయ నమ:”
భాలా అంటే సంస్కృతంలో నుదిటి కేంద్రం. చంద్ర అంటే నెలవంక చంద్రుడు. భాలాచంద్ర అంటే ఎక్కడి నుంచో పడే అమృతం చుక్కలు. అన్నింటిని నయం చేసే వైద్యం రహస్యం అది.
Related News
Vinayaka Chavithi 2024: గణపతిని ఏ సమయంలో ప్రతిష్ఠించాలి.. పూజ విధానం ఇదే..!
స్థాపన రోజున సర్వార్థ సిద్ధి యోగం కూడా ప్రబలుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఈ రోజు సింహరాశిలో సూర్యుడు, బుధుడు కలిసి ఉండటం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఈ యోగం అన్ని కోరికలను నెరవేరుస్తుందని భావిస్తారు.