Amazon : బిజినెస్ వేల్యూ డేస్ సేల్ ను ప్రకటించిన అమేజాన్
అర్హులైన కస్టమర్లు తక్షణ 30 రోజుల వడ్డీరహితమైన క్రెడిట్ ను పొందవచ్చు, రహస్యమైన ఖర్చులు లేకుండా 12 నెలల వరకు విస్తరించదగిన కనీస వడ్డీ రేట్లు సేల్ సమయంలో నగదు ప్రవాహం నిర్వహించడంలో సహాయపడవచ్చు.
- By Latha Suma Published Date - 05:22 PM, Sat - 23 November 24

Business Value Days : అమేజాన్ బిజినెస్, ఆన్ లైన్ బి2బి మార్కెట్ ప్రదేశం, 16 రోజుల బిజినెస్ వేల్యూ డేస్ సేల్ కార్యక్రమాన్ని వ్యాపార కస్టమర్ల కోసం ప్రకటించింది. ఇది నవంబర్ 21 నుండి డిసెంబర్ 06, 2024 వరకు కొనసాగుతుంది. ద బిజినెస్ వేల్యూ డేస్ సేల్ ల్యాప్ టాప్స్, మానిటర్లు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ వాచీలు, సెక్యూరిటీ కెమేరాలు, చిన్న మరియు పెద్ద ఉపకరణాలు, ఆఫీస్ ఫర్నిచర్, డెకార్ మరియు ఫర్నిషింగ్, మరియు ఇతర ఆఫీస్ ఇంప్రూవ్ మెంట్ ఉత్పత్తులు వంటి లక్షలాది ఉత్పత్తులు సహా వ్యాపార కస్టమర్లకు సమగ్రమైన ఉత్పత్తుల శ్రేణిలో సాటిలేని 70% వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. ఇంకా, కస్టమర్లు ఈ సమయంలో మూడు కొనుగోళ్లల్లో రూ. 9,999 వరకు క్యాష్ బాక్ ను సంపాదించవచ్చు.
డిస్కౌంట్లతో పాటు, బిజినెస్ వేల్యూ డేస్ సేల్ సేకరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి సమగ్రమైన వ్యాపార పరిష్కారాలను కూడా అందిస్తున్నాయి. బిజినెస్ కస్టమర్లు ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ను కేవలం రూ. 399కి పొందవచ్చు, బహుళ-యూజర్ అకౌంట్ సామర్థ్యాలతో పాటు ఉచిత మరియు వేగవంతమైన షిప్పింగ్ ను కూడా ప్రారంభిస్తుంది. అనుకూలమైన ఆమోదిత పాలసీలు మరియు బడ్జెట్ నియంత్రణలతో ఒకే అకౌంట్ ద్వారా బహుళ సభ్యులను చేర్చడానికి ఈ ఫీచర్ టీమ్స్ కు అవకాశం ఇస్తుంది. అమేజాన్ పే లేటర్ సదుపాయం సేల్ సమయంలో నగదు ప్రవాహాన్ని అనుకూలం చేయడానికి తక్షణ క్రెడిట్ ఆప్షన్స్ ను కస్టమర్లకు అందిస్తోంది. అదనపు ప్రయోజనాలలో ‘బిల్ టు షిప్ టు’ ఫీచర్ వివిధ ప్రాంతాల్లో కొనుగోళ్లు మరియు డెలివరీలకు అవకాశం ఇస్తూనే జిఎస్ టి ఇన్ పుట్ క్రెడిట్ ప్రయోజనాలను కూడా నిర్వహిస్తోంది. భారీ ఆర్డర్ల కోసం, కస్టమర్లు ముందస్తుగా – రూపొందించిన డిస్కౌంట్లను పొందవచ్చు మరియు buybulk@amazon.comని సంప్రదించడం ద్వారా ప్రత్యేకమైన సహాయం అందుకోవచ్చు.”
Read Also: Food poisoning : విద్యార్థుల మరణాలపై సీఎం ఎందుకు దృష్టి సారించడం లేదు: ఎమ్మెల్సీ కవిత