Discount On Car: ఈ స్పోర్ట్స్ కారుపై రూ. 1.35 లక్షల వరకు డిస్కౌంట్!
టాటా ఆల్ట్రోజ్ రేసర్‌లో 1.2 లీటర్ రెవోట్రాన్ టర్బోచార్జ్డ్ ఇంజన్ 120 PS పవర్, 170 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అమర్చబడి ఉంటుంది.
- By Gopichand Published Date - 02:59 PM, Sat - 8 March 25

Discount On Car: మార్చి నెల గడుస్తున్న కొద్దీ కార్లపై ఆఫర్లు కూడా పెరుగుతున్నాయి. డీలర్లు పాత, ఇప్పటికే ఉన్న స్టాక్‌ను క్లియర్ చేసి మార్చి 31లోగా కొత్త స్టాక్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు చూస్తున్నారు. అందుకోసం వినియోగదారులను ఆకర్షించడానికి ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ఈ సమయంలో టాటా మోటార్స్ అత్యధిక తగ్గింపును (Discount On Car) అందిస్తోంది. సంస్థ శక్తివంతమైన స్పోర్టి ఆల్ట్రోజ్ రేసర్ ఈ జాబితాలో ఉంది. మీరు ఈ కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ అవకాశం మీకు మంచిదని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
టాటా ఆల్ట్రోజ్ రేసర్‌పై రూ. 1.35 లక్షల తగ్గింపు
ఈ నెలలో ఆల్ట్రోజ్ రేసర్‌పై మంచి ఆఫర్ ఉంది. మార్చిలో ఈ కారుపై రూ.1.35 లక్షల వరకు తగ్గింపును అందజేస్తున్నారు. కానీ ఈ తగ్గింపు కొత్త మోడల్‌పై కాదు.. MY24 మోడల్‌పై ఇవ్వబడుతోంది. అయితే 2025 మోడల్‌పై ఎటువంటి తగ్గింపు లేదు. టాటా ఆల్ట్రోజ్ రేసర్‌లో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.9.49 లక్షల నుంచి రూ.10.99 లక్షల వరకు ఉంది. ఈ కారు ఫీచర్లు, ఇంజన్ గురించి తెలుసుకుందాం.
Also Read: IPL Tickets: ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్.. టికెట్ల ధర రూ. 999 నుంచి ప్రారంభం!
శక్తివంతమైన ఇంజిన్
టాటా ఆల్ట్రోజ్ రేసర్‌లో 1.2 లీటర్ రెవోట్రాన్ టర్బోచార్జ్డ్ ఇంజన్ 120 PS పవర్, 170 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అమర్చబడి ఉంటుంది. ఇందులో 16 అంగుళాల టైర్లు ఉన్నాయి. ఇది యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, EBDతో ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌లు, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంది.
ఆల్టోజ్ రేసర్ పొడవు 3990mm, వెడల్పు 1755mm, ఎత్తు 1523mm. వీల్ బేస్ 2501mm, గ్రౌండ్ క్లియరెన్స్ 165mm కాగా దీని బూట్ స్పేస్ 345 లీటర్లు. ఆల్ట్రోజ్ రేసర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు. ఇది హ్యుందాయ్ ఐ20, మారుతి సుజుకి ఫ్రాంక్స్ టర్బో కార్లతో పోటీ పడుతుంది. టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ రేసర్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా అత్యంత వేగవంతమైన భారతీయ కారుగా బిరుదును పొందింది. ఇది అనేక అధునాతన, ఆహ్లాదకరమైన ఫీచర్లతో వస్తున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు. ఇది రెండు నిమిషాల 21.74 సెకన్లలో ఈ రికార్డును సృష్టించింది.