Bharat EV Fest: ‘భారత్ ఈవీ ఫెస్ట్’ పేరుతో ఓలా భారీ ఆఫర్లు
ఓలా ఎలక్ట్రిక్ దసరా సందర్భంగా 'భారత్ ఈవీ ఫెస్ట్' పేరుతో పండుగ సేల్‌ను ప్రారంభించింది. ఈ ఫెస్టివల్ సేల్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లు, బ్యాటరీలపై భారీ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్, బెస్ట్ డీల్స్ అందిస్తోంది.
- Author : Praveen Aluthuru
Date : 17-10-2023 - 4:43 IST
Published By : Hashtagu Telugu Desk
Bharat EV Fest: ఓలా ఎలక్ట్రిక్ దసరా సందర్భంగా ‘భారత్ ఈవీ ఫెస్ట్’ పేరుతో పండుగ సేల్‌ను ప్రారంభించింది. ఈ ఫెస్టివల్ సేల్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లు, బ్యాటరీలపై భారీ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్, బెస్ట్ డీల్స్ అందిస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ అక్టోబర్ 16 నుంచి దేశవ్యాప్తంగా పండుగల ఆఫర్లను ప్రకటించింది. లాభదాయకమైన తగ్గింపులు, బ్యాటరీ గ్యారెంటీ పథకాలు మరియు కస్టమర్ల కోసం మరిన్ని అద్భుతమైన ఆఫర్‌లను తీసుకొచ్చింది.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపై కొనుగోలుదారులు రూ.24,500 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. కస్టమర్‌లు 5 సంవత్సరాల బ్యాటరీ వారంటీ (రూ. 7,000 వరకు విలువైనవి) , ఎక్స్‌ఛేంజ్ బోనస్‌లు (రూ.10,000 వరకు) మరియు నో-కాస్ట్ ఈఎంఐ (EMI) (భాగస్వామ్య బ్యాంకుల నుండి 7,500 వరకు) వంటి ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ ఆఫర్లను పొందవచ్చు.
భారత్ ఈవీ ఫెస్ట్‌లో బ్యాటరీలపై 5ఏళ్ల వరకు వారెంటీ ఇస్తోంది. సాధారణంగా ఈవీ బ్యాటరీలపై 3ఏళ్ల వరకే వారెంటీలు ఇస్తుంది. కానీ ఈసారి దానిని 5ఏళ్లకు పెంచింది. ఆల్ న్యూ ఎస్1 ప్రోపై 5ఏళ్ల ఎక్స్టెండెడ్ వారెంటీని కూడా అందిస్తోంది. ఇక ఎస్1 ఎయిర్‌పై 5ఏళ్ల ఎక్స్టెండెడ్ వారెంటీ మీద 50శాతం డిస్కౌంట్ని కూడా ఇస్తోంది. బ్యాటరీలపై ఉండే వారెంటీని 50శాతం డిస్కౌంట్లో అందిస్తోంది. ఈవీలను టెస్ట్ డ్రైవ్ చేసిన వారికి లక్కీ ప్రైజ్‌లు కూడా ఇస్తోంది సంస్థ. అదే సమయంలో.. ఎవరికైనా ఎస్1 మోడల్ని రిఫర్ చేస్తే.. మీరు రివార్డులు కూడా పొందొచ్చు.
Also Read: Nakki Lake : నక్కి సరస్సు, మౌంట్ అబూ